Tuesday, April 24, 2018

 
ఈ కాల సాగరగర్భంలో ఏ లీలలు ఇమిడిఉన్నాయో
ఏ అల ఎందుకు పుడుతుందో..ఏ బ్రతుకు ఏ దారి పడుతుందో

ఎవ్వరికెవ్వరు ప్రాణమో..ఏ ప్రాణం ఎటు పోతుందో
ఈ ఆరని మంటలనడగాలి
ఈ జీవితమెందుకు ముగిసిందో..ఈ జన్మకు పిదప ఏముందో
ఈ బూడిదకుప్పే చెప్పాలి 

బండికి రెండే చక్రాలు..తన బ్రతుకుకు రెండే దీపాలు
ఈ చక్రాలు పరుగులు తియ్యాలి..ఆ దీపల వెలుగులు పెరగాలి
చీకటిలోన వెలుగుందో..వెలుగు దాటితే చీకటి ఉందో
జీవితాన్ని మనమడగాలి..ఆ దేవుడే జవాబు చెప్పాలి

కన్నతండ్రి తల్లయినాడు..తన రెండు కళ్ళకు రెప్పయినాడు
రెప్పలు ఆపే కన్నీళ్ళు..రేపాటి కలలకు పందిళ్ళు
ఆ కలలు నిజాలుగ చూస్తడో..ఇది కాదని దేవుడు ఏంచేస్తాడో?

సినిమా:- తుఫాన్ మెయిల్
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
గానం:- బాలు


ee kaala saagaragarbhamlO E leelalu imiDiunnaayO 
E ala enduku puDutundO..E bratuku E daari paDutundO

evvarikevvaru praaNamO..E praaNam eTu pOtundO
ee aarani manTalanaDagaali
ee jeevitamenduku mugisindO..ee janmaku pidapa EmundO
ee booDidakuppE cheppaali 

banDiki renDE chakraalu..tana bratukuku renDE deepaalu
ee chakraalu parugulu tiyyaali..aa deepala velugulu peragaali
cheekaTilOna velugundO..velugu daaTitE cheekaTi undO
jeevitaanni manamaDagaali..aa dEvuDE javaabu cheppaali 

kannatanDri tallayinaaDu..tana renDu kaLLaku reppayinaaDu
reppalu aapE kanneeLLu..rEpaaTi kalalaku pandiLLu
aa kalalu nijaaluga choostaDO..idi kaadani dEvuDu EmchEstaaDO?

sinimaa:- tufaan meyil
saahityam:- aachaarya aatrEya 
gaanam:- baalu  


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]