Tuesday, April 24, 2018

 
లెగు లెగు లెగు స్వతంత్రమా..నిదురబొయే స్వతంత్రమా
నీ చీకటి తొలగిస్తాము..నీకు స్వేచ్చ కలిగిస్తాము

విద్యన్నది వివేకమైతే..వివేకాన్ని ప్రేమను చేసి
ప్రేమే పరమార్ధమని..ప్రేమే సర్వస్వమని
ప్రేమతోని కలిమి లేమి కళ్యాణం కావాలంటూ
నలుదిక్కుల నా గొంతు ప్రజ్వలింప చేస్తాను
నవ్య జగతి సిద్ధికై దివ్వెనై వెలుగుతాను

రాజకీయ రంకుతోని..వొటులన్న కంపుతోని
స్వతంత్రాన్ని చంపుతున్న స్వార్ధపరుల కుతంత్రాన్ని
కుయుక్తులున్ని నిలదీసి నడివీధిలో పడదోసి
కలమే కత్తిని చేసి..ఖండఖండలుగా కోసి
నవ్యలోక సౌధానికి మెట్టు మెట్టు కడతాను
విశ్వశాంతి పుష్పానికి విద్య ధారపోస్తాము

మనిషొక మాటంటున్నారు..దారితప్పి పోతున్నారు
లక్ష్యాలను వేరును చేసి..ఇక్యత వీడి చెడుతున్నారు
శాంతి సమరం సత్యం ధర్మం
వేరు చేసి కేకలు వేసి
విడివిడిగా నడిచామంటే
విప్లవం రాదురా భాయి
విప్లవం రాదురా భాయి
ఐదువేళ్ళు కలిస్తేనురా..పిడికిలి పొడుస్తుందిరా
నలుగురము ఒకటైనప్పుడే..మన లక్ష్యం నిలిస్తుందిరా
మన లక్ష్యం నిలిస్తుందిరా..మన మాటే గెలుస్తుందిరా


గానం:- బాలు, చిత్ర

legu legu legu swatantramaa..niduraboyE swatantramaa
nee cheekaTi tolagistaamu..neeku swEccha kaligistaamu

vidyannadi vivEkamaitE..vivEkaanni prEmanu chEsi
prEmE paramaardhamani..prEmE sarvasvamani
prEmatOni kalimi lEmi kaLyaaNam kaavaalanTU
naludikkula naa gontu prajwalimpa chEstaanu 
navya jagati siddhikai divvenai velugutaanu 

raajakeeya rankutOni..voTulanna kamputOni
swatantraanni champutunna swaardhaparula kutantraanni 
kuyuktulunni niladeesi naDiveedhilO paDadOsi 
kalamE kattini chEsi..khanDakhanDalugaa kOsi
navyalOka soudhaaniki meTTu meTTu kaDataanu
viSwaSaanti pushpaaniki vidya dhaarapOstaamu 
  
manishoka maaTanTunnaaru..daaritappi pOtunnaaru
lakshyaalanu vErunu chEsi..ikyata veeDi cheDutunnaaru 
Saanti samaram satyam dharmam 
vEru chEsi kEkalu vEsi
viDiviDigaa naDichaamanTE
viplavam raaduraa bhaayi
viplavam raaduraa bhaayi
aiduvELLu kalistEnuraa..piDikili poDustundiraa 
naluguramu okaTainappuDE..mana lakshyam nilistundiraa 
mana lakshyam nilistundiraa..mana maaTE gelustundiraa


gaanam:- bAlu, chitra

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]