Sunday, April 29, 2018

 
మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై
మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి
గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి
కౌగిలిలో కాశీ క్షేత్రం.. శివశక్తుల తాండవ నృత్యం
నిలిచి.. వలపు పండించేది..
నిన్ను నన్ను బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
అనురాగానికి పరిమళమై.. ఆరాధనకి సుమగళమై..
వేదాశీస్సులు కురిపించేది..
వేయి ఉషస్సులు వెలిగించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

ఒక ప్రేమ అమృత శిల్పం.. ఒక ప్రేమ బుద్దుడి రూపం
ఒక ప్రేమ రామచరిత్రం.. ఒక ప్రేమ గాంధీ తత్వం
చితినైనా చిగురించేది.. మృతినైనా బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
నేనున్నాని కోరేదీ..ఈ.. నీవే నేనని నీడయ్యేదీ..ఈ..
కమ్మగ చల్లగ కనిపించేది.. బ్రహ్మని సైతం కని పెంచేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై
మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది
ప్రేమ.. ప్రేమ ప్రేమ..
ప్రేమ.. ప్రేమ ప్రేమ..
ప్రేమ.. ప్రేమ ప్రేమ..


సినిమా:- రెండు జళ్ళ సీత
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- రమేశ్ నాయిడు

గానం:- ఎస్.జానకి,బాలు 

Labels: , , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]