Sunday, April 29, 2018

 
అటు దహనం, ఇటు ఖననం
అటు మరణం, ఇటు జననం
ఇంతకన్న ఏం చేస్తావు..నన్ను ఏం సాధిస్తావు

నిన్ను నమ్మి ఎప్పుడెవ్వడు సుఖపడ్డాడు
నీలో హృదయమన్నది ఎవడు చూడగలిగాడు
సత్యం నీవని నమ్మి, ధర్మం నీవని నమ్మి..హరిశ్చంద్రుడేమైనాడు
కూటికి పేదై కాటికాపరి అయినాడు
జీవచ్చవమై నాలా శ్మశానం చేరేడు

నా ఇల్లని, నా వాళ్ళని ఇక్యంగా బ్రతకాలని
ఆశలు అడియాశలయిన పిచ్చివాడిని నేను
ఏ సుముహుర్తంలో నువ్విటు వస్తావని..
చితిమంటల వెలుగులో నన్ను కలుసుకుంటావని
సర్వసమానత్వానికి వేదికై ఈ శ్మశానం
ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం

సినిమా:- మగధీరుడు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు

aTu dahanam, iTu khananam
aTu maraNam, iTu jananam
intakanna Em chEstAvu..nannu Em saadhistaavu

ninnu nammi eppuDevvaDu sukhapaDDaaDu
neelO hRdayamannadi evaDu chooDagaligADu
satyam neevani nammi, dharmam neevani nammi..hariSchandruDEmainADu
kooTiki pEdai kaaTikaapari ayinaaDu
jeevacchavamai naalA SmaSaanam chErEDu

naa illani, nA vALLani ikyangA bratakAlani
aaSalu aDiyaaSalayina picchivADini nEnu
E sumuhurtamlO nuvviTu vastAvani..
chitimanTala velugulO nannu kalusukunTAvani
sarvasamaanatvaaniki vEdikai ee SmaSAnam
ikkaDa jaragaka tappadu manaku sangamam

sinimA:- magadheeruDu
saahityam:- vETUri
sangeetam:- bAlu
gaanam:- bAlu   

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]