Sunday, April 29, 2018

 
ఇంటి పేరు అనురాగం..ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం..ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

వెలుగునీడలయినా, కలిమిలేములయినా
మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముగ్గులే
ఎదిరించని జానకి, నిదురించని ఊర్మిళ
తోడికోడళ్ళుగా ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా, రామలక్ష్మణులుగా
కొండంత అండగా అన్నలు తొడుండగా

వయసులో చిన్నయినా, మనసులో పెద్దగా
తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా
అమ్మగా, నాన్నగా, బిడ్డగా, పాపగా
ఏ దేవకి కన్నా, ఏ యశోద పెంచినా
గోకులాన వెలిసాడు గోపాలకృష్ణుడు
మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు

ఏ కొండల పుట్టినా, ఏ కోనలపొంగినా
సాగే ప్రతి జీవనదికి..సాగరమే తుది మజిలి
సంసారమనే ఒక సాగరం
అన్నతమ్ములకైనా ఆలుమగలకయినా ఈ బ్రతుకు ప్రయాగలో
తప్పదులే సంగమం..ఈ త్రివేణి సంగమం

ఇంటి పేరు అనురాగం..ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం..ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

వెలుగులోన నీడగా, లేమిలోన కలిమిగా
అందరము ఒక్కటిగా కలిసినప్పుడు
ఎడబాటుల బాటలన్ని కూడలి కావా
ఎదచాటున ఆపేక్షలే పొంగి పొరలవా
మమకారం ఒక్కటే మానవతకు ఆధారం
ఈ సంగమాన్ని ఆపడం ఎవరి తరం..ఇంకెవ్వరి తరం

సినిమా:- మగధీరుడు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు  

inTi pEru anuraagam..muddu pEru mamakAram
maa illE bRndAvanam..mukkOTi dEvatalu velasina dEvAlayam

veluguneeDalayinaa, kalimilEmulayinaa
maa mungiTa eppuDU chirunavvula muggulE
edirinchani jAnaki, nidurinchani oormiLa
tODikODaLLugA illu chakkadiddagA
prEmaku roopAlugA, rAmalakshmaNulugA
konDanta anDagA annalu toDunDagA

vayasulO chinnayinaa, manasulO peddagA
tammuDanna maaTakE taanu saakshigA
ammagA, naannagA, biDDagA, pApagA
E dEvaki kannA, E yaSOda penchinA
gOkulAna velisADu gOpAlakRshNuDu
maa inTiki deepamai chinnAri tammuDu

E konDala puTTinA, E kOnalaponginA
saagE prati jeevanadiki..saagaramE tudi majili
samsAramanE oka saagaram
annatammulakainaa aalumagalakayinaa ee bratuku prayAgalO
tappadulE sangamam..ee trivENi sangamam

inTi pEru anuraagam..muddu pEru mamakAram
maa illE bRndAvanam..mukkOTi dEvatalu velasina dEvAlayam

velugulOna neeDagA, lEmilOna kalimigA
andaramu okkaTigA kalisinappuDu
eDabaaTula baaTalanni kooDali kaavA
edachaaTuna aapEkshalE pongi poralavA
mamakaaram okkaTE maanavataku aadhaaram
ee sangamaanni aapaDam evari taram..inkevvari taram

sinimA:- magadheeruDu
saahityam:- vETUri
sangeetam:- bAlu
gaanam:- bAlu   

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]