Saturday, April 28, 2018

 
ఒక మాట చెప్పానా..ఒక పాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న వీణ
ఎవరెంత ఆపినా..కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న వాన
చిన్ని గుండెలో ఎన్నెని ఆశలో
గొంతు విప్పి చెప్పలేని ఎన్ని మాటలో
రాతిరేలలో చుర్రుక్కుమంటదో
మనసులేని మనిషి నేను ఏమి చెయ్యను

నీ కంటిచూపులే అలా అలా నను తాకగా
నీ వెంట నేనిలా ప్రతిక్షణం తోడు ఉండనా
దారితప్పి తిరుగుతున్న బాటసారిని
పూలదారిలోకి నువ్వు నడిపినావని
జీవితానికి అర్ధమేంటో తెలిపినావని
మనసు తెరిచి నన్ను నువ్వు గెలిచినావని
క్షమించమన్న అర్హతయిన నాకులేదని

ఈ చీకటెప్పుడు ఇలా ఇలాగే ఉండిపోదులే
నీ నవ్వు తాకితే సరాసరి వెన్నెలవునులే
పంజరాన చిక్కుకున్న చిలక నీవని
బాధపడి కూర్చుని ఉంటే లాభమేంటని
వేటగాడితో చెలిమి చేసినావని
తప్పు తెలుసుకున్నవాడే మనిషౌనని
నీ మాటతో పొందినాను కొత్త జన్మని

సినిమా:- నీరీక్షణ
సంగీతం:- ఎం.ఎం.శ్రీలేఖ
గానం:- బాలు

oka maaTa cheppAnA..oka pATa pADanA
idi mounabAsha meeTutunna veeNa
evarenta aapinaa..kannIru aagunA
idi kanTipApa challutunna vAna
chinni gunDelO enneni aaSalO
gontu vippi cheppalEni enni mATalO
raatirElalO churrukkumanTadO
manasulEni manishi nEnu Emi cheyyanu

nee kanTichoopulE alA alA nanu tAkagA
nee venTa nEnilA pratikshaNam tODu unDanA
daaritappi tirugutunna baaTasArini
pooladaarilOki nuvvu naDipinAvani
jeevitAniki ardhamEnTO telipinAvani
manasu terichi nannu nuvvu gelichinAvani
kshaminchamanna arhatayina naakulEdani

ee cheekaTeppuDu ilA ilAgE unDipOdulE
nee navvu taakitE sarAsari vennelavunulE
panjarAna chikkukunna chilaka neevani
bAdhapaDi koorchuni unTE lAbhamEnTani
vETagADitO chelimi chEsinAvani
tappu telusukunnavADE manishaunani
nee maaTatO pondinAnu kotta janmani

sinimA:- nIrIkshaNa
sangeetam:- m.m.SrIlEkha
gAnam:- bAlu 

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]