Tuesday, April 24, 2018

 
బండెళ్ళిపోతుందే చెల్లెలా..బతుకు బండెళ్ళిపొతుందే చెల్లెలా
గతుకు బితుకు లేక బతకనేర్చిన బండి
శతబోను పెడతందే చెల్లెలా

బతుకెళ్ళిపొతుంది  ఒరన్నయ్యో..బతుకు బండెళ్ళిపొతుంది ఒరన్నయ్య
ఆ బతుకు ఈ బతుకు అతుకుపెట్టెలతోటి
బండెళ్ళిపోతుంది ఒరన్నయ్యో..బతుకు బండెళ్ళిపొతుందు ఒరన్నయ్య


దొరలెక్క దిబ్బేలో పరుపులు..అల్ల పేదోళ్ళ బతుకంత బరువులు
బతుకే బరువైపొతే చెల్లెలా..దాని కూలోడే మొయ్యాలే చెల్లెలా
ధర్మమడిగావంటే చెల్లెలా..మన ఖర్మనే తిడతారే చెల్లెలా
పేదోళ్ళ దిబ్బెలో చెల్లేలా..ఇంత ఆధరణ దొరికేనా చెల్లెలా

కష్టాల పట్టాల మెలికలు..మనిషి గుండెల్లో తెగపుట్టే పరుగులు
పెట్టేల్లో జనమేమో కిటకిటా..ముద్ద పెట్టే దిక్కే లేక కటకట
స్టేషన్లన్ని మారిపోయినా..బండి ఏ దేశానికి వెళ్ళి ఆగినా
పట్టాల మార్పేనే చెల్లేలా..మన పొట్టైనా నిండాదే చెల్లెలా.

కిటికీలో కనిపించే కాలము..అల్ల గిరగిర తిరిగే భూగోళం
యేడకి పోతుందో తెలవదు..బండి గుండెళ్ళొ బరువేమో తరగదు
పుట్టింటిలో పడి బ్రతికినా..దాని టిక్కెట్టు నీ చెతికిచ్చినా
ఊరు పేరు రాసేఉంటాది..బతుకు దూరమెంతో వేసివుంటాది

పుట్టెటప్పుడు కొన్న టిక్కెట్టు..నిన్ను మోసేటప్పుడు కాస్త చూపెట్టు
పదుగురితో పరుగెట్టే పయనము..కడకు నలుగిరితో నడిచెళ్ళే దూరము..
జండాలు రెండేనే చెల్లెలా..అవి చావుపుట్టకలంట చెల్లెలా
సిగినల్ ఇచ్చేవోడు దేవుడు..బండి దిగివెళ్ళిపోయేవాడు జీవుడు

సినిమా:- ఇదా ప్రపంచం
సాహిత్యం:- జాలది
సంగీతం:- చక్రవర్తి
గానం:- మనో, వందేమాతరం, శైలజ

banDeLLipOtundE chellelA..batuku banDeLLipotundE chellelaa
gatuku bituku lEka batakanErchina banDi
SatabOnu peDatandE chellelaa

banDeLLipOtundi orannayyO..batuku banDeLLipotundi orannayya
aa batuku ee batuku atukupeTTelatOTi
banDeLLipOtundi orannayyO..batuku banDeLLipotundu orannayya


doralekka dibbElO parupulu..alla pEdOLLa batukanta baruvulu
batukE baruvaipotE chellelA..daani koolODE moyyaalE chellelaa
dharmamaDigaavanTE chellelaa..mana kharmanE tiDataarE chellelaa
pEdOLLa dibbelO chellElaa..inta aadharaNa dorikEnaa chellelaa

kashTaala paTTaala melikalu..manishi gunDellO tegapuTTE parugulu
peTTEllO janamEmO kiTakiTA..mudda peTTE dikkE lEka kaTakaTa
sTEshanlanni maaripOyinaa..banDi E dESaaniki veLLi aaginaa
paTTaala maarpEnE chellElaa..mana poTTainaa ninDaadE chellelaa.

kiTikeelO kanipinchE kaalamu..alla giragira tirigE bhoogOLam
yEDaki pOtundO telavadu..banDi gunDeLLo baruvEmO taragadu
puTTinTilO paDi bratikinaa..daani TikkeTTu nee chetikicchinaa
ooru pEru raasEunTaadi..batuku dooramentO vEsivunTAdi

puTTeTappuDu konna TikkeTTu..ninnu mOsETappuDu baaga choopeTTu
paduguritO parugeTTE payanamu..kaDaku nalugiritO naDicheLLE dooramu..
janDaalu renDEnE chellelaa..avi chaavupuTTakalanTa chellelaa
siginal icchEvODu dEvuDu..banDi digiveLLipOyEvaaDu jeevuDu

sinimaa:- idA prapancham
saahityam:- jaaladi
sangeetam:- chakravarti
gaanam:- manO, vandEmaataram, Sailaja 

Labels: , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]