Sunday, April 29, 2018

 
మంచోళ్ళందరు పోయారు..మంచిని చెప్పే పోయారు
ఆ మంచిని కాచే మనుషులిప్పుడు మనలో కరువైనారు
రామయ్యా..రావయ్యా..ఈ రాజ్యమే నీదయ్యా

కొటిపేదల తోటివాడుగా కోళాయెవడు కడతాడు
కాల్చుకోమ్మని రొమ్ముచూపిన నేత ఎప్పుడు పుడతాడు
దొరలగుండెల్లో దూసుకేళ్ళీన మన్నెంవీరుడు రాబోడు
దేశభక్తులు, త్యాగమూర్తులు కలలు కధలైపోయరు
ఎవ్వరో తెచ్చింది, తేరగా చిక్కింది
కోతుల చెతుళ్ళో కొబ్బరే అయ్యింది
అహా..దేశం దేశంగా ఉన్నదా..
ఉన్నది కన్నది చెప్పేదంతా, వోట్లుమాత్రం వెయ్యాలంటా

బుద్ధిమంతులు, నీతిమంతులు వద్దు వద్దనుకున్నారు
తోడుదొంగలు, దొంగకొంగలు గూడుపుఠాణి చేసారు
రాజయ్కీయము ఉన్నవాళ్ళకు వ్యాపారంగా మారింది
ప్రజారాజ్యం వారసత్వమై వేసినచొటే ఉంటొంది
ఎవ్వడు చెప్తాడు, ఎవ్వడు వింటాడు
ఎవ్వడు ఉంటాడు, ఎప్పుడు దిగుతాడు
అహా..జ్యోస్యం చెప్పాలి సాములు
లంచమంటే లాంచనమంట, త్యాగమంటే లాభమంట

సినిమా:- పిచ్చిపంతులు
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

manchOLLandaru pOyAru..manchini cheppE pOyAru
aa manchini kaachE manushulippuDu manalO karuvainAru
rAmayyA..rAvayyA..ee rAjyamE needayyA

koTipEdala tOTivADugA kOLAyevaDu kaDatADu
kaalchukOmmani rommuchoopina nEta eppuDu puDatADu
doralagunDellO doosukELLIna mannemveeruDu rAbODu
dESabhaktulu, tyAgamoortulu kalalu kadhalaipOyaru
evvarO tecchindi, tEragA chikkindi
kOtula chetuLLO kobbarE ayyindi
ahA..dESam dESamgaa unnadaa..
unnadi kannadi cheppEdantA, vOTlumaatram veyyAlanTA

buddhimantulu, neetimantulu vaddu vaddanukunnAru
tODudongalu, dongakongalu gooDupuThANi chEsAru
raajaykeeyamu unnavALLaku vyApArangA maarindi
prajAraajyam vaarasatvamai vEsinachoTE unTondi
evvaDu cheptADu, evvaDu vinTADu
evvaDu unTADu, eppuDu digutADu
ahA..jyOsyam cheppAli saamulu
lanchamanTE laanchanamanTa, tyAgamanTE lAbhamanTa

sinimA:- picchipantulu
saahityam:- AchArya AtrEya
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]