Saturday, April 28, 2018

 
పాడనా వేణువునై..నీవు నా ప్రాణమై
నా జీవన బృందావనిలో..ప్రియదర్శన మాధురిలో

చెలి, సఖి, ప్రియే, చారుశీలే అని
తలచి, తనువు మరచి కలలు కన్నానులే
కాముడిలా సుమబాణాలు వేసి..తగిలిన నీ చలికోణలు చూసి
ఆమనిలో సుమగంధాలు పూసి..కవితలుగా నవవేదాలు రాసి
మోవికి తగిలి..ముద్దుల మురళి..
కౌగిలిలో ప్రియకళ్యాణినే..సంగీతమే పాడిందిలే

కలం, గళం, స్వరం నాకు నీవేనని
మధుర ప్రణయ కవిత పాడుతున్నానులే
నీలో అలిగే అందాలరూపం..నాలో వెలిగే శృంగారదీపం
నీలో కరిగే ఆ ఇంద్రచాపం..నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే..వెన్నెల చినుకై
రమ్మందిలే, మనసిమ్మందిలే..నీ రాగమే పాడిందిలే

సినిమా:- సుందరి సుబ్బారావు
సాహిత్యం:- వేటూరి
గానం:- ఎస్.జానకి, బాలు

pADanA vENuvunai..neevu naa prANamai
nA jeevana bRmdAvanilO..priyadarSana maadhurilO

cheli, sakhi, priyE, chAruSeelE ani
talachi, tanuvu marachi kalalu kannAnulE
kAmuDilA sumabANAlu vEsi..tagilina nee chalikONalu choosi
aamanilO sumagandhAlu poosi..kavitalugA navavEdaalu raasi
mOviki tagili..muddula muraLi..
kougililO priyakaLyANinE..sangeetamE paaDindilE

kalam, gaLam, swaram naaku neevEnani
madhura praNaya kavita pADutunnAnulE
neelO aligE andAlaroopam..nAlO veligE SRngAradeepam
neelO karigE aa indrachaapam..nAlO jarigE amRtAbhishEkam
sannani kulukE..vennela chinukai
rammandilE, manasimmandilE..nee rAgamE pADindilE

sinimA:- sundari subbArAo
saahityam:- vETUri
gaanam:- S.jAnaki, bAlu

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]