Sunday, April 29, 2018

 
తెలుసా .నీకు తెలుసా ... ప్రేమంటే ఒకే లాగ ఉదయించె గగనమని నీకు తెలుసా ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మాట వినిపించే కావ్యమని . ఒకే దివ్య వెలుగొందే కోవెలని అదే అదే .అదే నా హృదయమని . ప్రణయమని ... ప్రాణమని! నీకు తెలుసా ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని ఒకే మురళి పలికే గోకులమని . ఒకే కెరటము పొంగే యమున అని అదే అదే నా జీవమని . గానమని . మౌనమని ... తెలుసా!
సీతగాలి వీచినప్పుడు లేత ఎండలా ఎండకన్ను సోకినప్పుడా మంచు కొండలా ఆదుకొనే వెచ్చని మమత ఆవిరయ్యే చల్లని ఎడద ఒకటే శృతి .ఒకటే లయ. ఒకటే స్వరము మౌన రాగమొకటే అదే . అదే. అనురాగమని మౌనయోగమని . ప్రేమదీపమని . తెలుసా . నీకు తెలుసా ...!!! శరత్ కాల నదులలోని తేట నీటిలా పుష్య మాస సుమగళాల తేనెవాసలా సుప్రసన్న సుందర కవిత సుప్రభాత మరంద గుళిక ఒక పార్వతి . ఒక శ్రీపతి . ఒక సరస్వతి " సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్దాసారకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే " ఉన్న మంత్రమొకటే . అదే .అదే . మమకారము సృష్టి కారణం ... బ్రహ్మకు జననం .తెలుసా .నీకు తెలుసా ...!!!

సినిమా:- బాబాయి-అబ్బాయి సాహిత్యం:- వేటూరి సంగీతం:- చక్రవర్తి గానం:- ఎస్.జానకి, బాలు

Labels: , , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]