Thursday, April 26, 2018

 
ఓ మానవతి..తెలుసుకో నీ గతి
ఆడదిగా పుట్టడమే అధోగతి
అది మా సంస్కృతి..ఇది నీ జీవన్మృతి

పెళ్ళయిన ప్రతి ఆడది అడవిలోని సీత
కుళ్ళికుళ్ళి ఏడవడం విధి రాసిన రాత
భర్త అనే భగవంతుడు కోసిన ఎదకోత

నీ రూపాన్నే వరించి..నీ అందాన్నే హరించి
నీ త్యాగం అనుభవించి..నీ సర్వం సంగ్రహించి
జాలి దయ లేకుండా చివరకు నిన్నే వధించి
కులకడమే మా సంస్కృతి..కులసతి
అదే నీ జీవన్మృతి

తనపేరుకు నీ సమాధి కట్టేవాడొకడు
తనపదవికి నిన్ను పునాది చెసుకునేవాడొకడు
నిన్ను బొమ్మగా చేసి ఆడుకునేవాడొకడు
ఇంతకు ఈ మగడనే ఈ మగాడు నీకెవ్వడు
ఏనాటిది ఈ రుణం..ఎందుకింత దారుణం
కడుపున పుట్టినవాడే కంఠానికి పాశమేసి
నీ పాలిట యముడైతే..నీకెందుకు మమకారం
మరిచావా ఆదిశక్తి అవతారం
తెలుసుకో నీకు ఉన్న అధికారం
దాటిరా పాతబడ్డ ప్రాకారం
చుట్టుకో కొత్తబ్రతుకు శ్రీకారం


సినిమా:- ఓ భార్య కధ
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు

O maanavati..telusukO nee gati
aaDadigaa puTTaDamE adhOgati
adi maa samskRti..idi nee jeevanmRti

peLLayina prati aaDadi aDavilOni seeta
kuLLikuLLi EDavaDam vidhi raasina raata
bharta anE bhagavantuDu kOsina edakOta

nee roopaannE varinchi..nee andaannE harinchi
nee tyaagam anubhavinchi..nee sarvam sangrahinchi
jaali daya lEkunDaa chivaraku ninnE vadhinchi
kulakaDamE maa samskRti..kulasati
adE nee jeevanmRti

tanapEruku nee samaadhi kaTTEvADokaDu
tanapadaviki ninnu punaadi chesukunEvADokaDu
ninnu bommagaa chEsi aaDukunEvADokaDu
intaku ee magaDanE ee magaaDu neekevvaDu
EnaaTidi ee ruNam..endukinta daaruNam
kaDupuna puTTinavaaDE kanThaaniki paaSamEsi
nee paaLiTa yamuDaitE..neekenduku mamakaaram
marichaavaa aadiSakti avataaram
telusukO neeku unna adhikaaram
daaTiraa paatabaDDA praakaaram
chuTTukO kottabratuku Sreekaaram


sinimaa:- O bhaarya kadha
saahityam:- vETUri
sangeetam:- bAlu
gaanam:- bAlu
  

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]