Monday, April 23, 2018

 
సుబ్బన్న సెప్పాడన్న స్వతంత్రం వచ్చిందని..స్వరాజ్యం వచ్చిందని
అప్పన్న అన్నాడన్న రాకముందే బాగుందని..స్వరాజ్యం రాక ముందే బాగుందని
ఈ వీరన్న అంటాడన్న..నిప్పులాంటి నిజమన్న
అప్పుడైనా ఇప్పుడైనా మన బ్రతుకులు ఇంతేనని..అవి మారవని

కూలాలు పోతవని..హెచ్చుతగ్గులుండవని
డెబ్బయియెళ్ళనుంచి చెవులు పగల చెప్పారు
సన్నజనాన్ని ఉబ్బేసి..వోట్లు కాస్తా కాజేసి 
సింహాసనమెక్కాక చిప్ప చెతికిచ్చారు 
వాళ్ళు సిగ్గే ఒగ్గేసారు

అర్ధరాతిరి ఆడది తిరగొచ్చు అన్నారు
మగాడితో సమానంగా హక్కులు ఇస్తామన్నారు
మానభంగాలు ఎన్నయినా..ప్రాణాలే పోతున్నా
ఎటేట ఈ జండా ఎగరెస్తౌన్నారు
మనకు ఇది తప్పదు అన్నారు

ఆకలి సావులు ఇంక ఉండవని బొంకేరు
అందరికి ఊరకెనే సదువు సెప్పుతామన్నరు
ప్రజారాజ్యమొచ్చిందని.. స్వర్గం దిగివస్తాదని 
నమ్మకాలు చెప్పి చెప్పి నట్టేట ముంచారు 
వాళ్ళు గట్టెక్కి చూసేరు   

సినిమా:- ఎర్ర మట్టి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

subbanna seppaaDanna swatantram vacchindani..swaraajyam vacchindani
appanna annaaDanna raakamundE baagundani..swaraajyam raaka mundE baagundani
ee veeranna anTaaDanna..nippulaanTi nijamanna
appuDainaa ippuDainaa mana bratukulu intEnani..avi maaravani

koolaalu pOtavani..hecchutaggulunDavani
DebbayiyeLLanunchi chevulu pagala cheppaaru
sannajanaanni ubbEsi..vOTlu kaastaa kaajEsi
siMhaasanamekkaaka chippa chetikicchaaru
vaaLLu siggE oggEsaaru

ardharaatiri aaDadi tiragocchu annaaru
magaaDitO samaanangA hakkulu istaamannaaru
maanabhangaalu ennayinaa..praaNaalE pOtunnaa
eTETa ee janDA egarestaunnaaru
manaku idi tappadu annaaru

aakali saavulu inka unDavani bonkEru
andariki oorakenE saduvu sepputaamannaru
prajaaraajyamocchindani.. swargam digivastaadani
nammakaalu cheppi cheppi naTTETa munchaaru
vaaLLu gaTTekki choosEru  

sinimaa:- erra maTTi
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]