Saturday, April 28, 2018

 
జం జం జం జరిగేనంట చెల్లెలి కళ్యాణం
ఢుం ఢుం ఢుం పలికేనంట మంగళవాయిద్యం
అటు ఇటు తెగ పరుగిడుతుంది అడుగులు నిలవని ఆనందం
ప్రతి ఒకరికి అందిస్తుంది పెళ్ళికి రమ్మని ఆహ్వానం
అంతావచ్చి దీవిస్తే నాకెంతో సంతోషం

దర్జాగా రాజాలాగా ఉంటాడండి అబ్బాయి
డాబు దర్పంలో కాబోయే బావామొగళాయి
మీనాలో రాణిలాగే వెళ్ళుతూ ఉంటే అమ్మాయి
అమ్మో నా దిష్టే తగలినో ఎమో బాబాయి
ఊరందరి తోబుట్టువులా పెరిగింది పాపాయి
పేరుపేరునా అందరిని పిలిచింది మా చెల్లాయి
తన మనువుకి అంతా రండి..మనసారా దీవించండి

ఈ ముచ్చటకోసం కళ్ళు చాన్నాళ్ళుగా చూస్తున్నాయి
చూసే సుముహుర్తం ఎపుడెప్పుడని కలవరపడినాయి
బొమ్మలే ముస్తాబయి కనపడుతుంటే చెల్లాయి
ఎదో తెరలాగా కన్నీళ్ళే చెమరిస్తున్నయి
పట్టలేని ఆనందంతో గంగై పొంగేనేమో
చెప్పలేని ఆరటంతో బెంగే కలిగిందేమో
ప్రతి చుక్క అక్షింతలుగా దీవించే తరుణం రాగా

సినిమా:- మాణిక్యం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం:- బాలు

jam jam jam jarigEnanTa chelleli kaLyaaNam
Dhum Dhum Dhum palikEnanTa mangaLavaayidyam
aTu iTu tega parugiDutundi aDugulu nilavani aanandam
prati okariki andistundi peLLiki rammani aahvaanam
antaavacchi deevistE naakentO santOsham

darjaagaa raajaalaagaa unTADanDi abbaayi
Daabu darpamlO kaabOyE baavaamogaLaayi
meenaalO raaNilaagE veLLutoo unTE ammaayi
ammO naa dishTE tagalinO emO baabaayi
oorandari tObuTTuvulA perigindi paapaayi
pErupErunaa andarini pilichindi maa chellAyi
tana manuvuki antaa ranDi..manasaaraa dIvinchanDi

ee mucchaTakOsam kaLLu chaannaaLLugaa choostunnaayi
choosE sumuhurtam epuDeppuDani kalavarapaDinaayi
bommalE mustaabayi kanapaDutunTE chellAyi
edO teralaagaa kannILLE chemaristunnayi
paTTalEni aanandamtO gangai pongEnEmO
cheppalEni aaraTamtO bengE kaligindEmO
prati chukka akshintalugaa deevinchE taruNam raagaa

sinimaa:- maaNikyam
saahityam:- sirivennela
sangeetam:- S.A.raajkumar
gaanam:- bAlu 

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]