Monday, December 17, 2007

 

వేణుమాధవా ఆ ..ఆ...వేణు మాధవా.....ఆ ..ఆ..

ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో

ఆ శ్వాసలో నే లీనమై

ఆ మోవిపై నే మౌనమై

నిను చేరని మాధవా.. ఆ.. ఆ..

మునులకు తెలియని జపములు జరిపినదా ....

మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి

తరగని వరముల సిరులని తలచినదా

కౄష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది

ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది

వేణు మాధవా నీ సన్నిధి

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదోచల్లని

నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలు వైపుల నడి రాతిరి

ఎదురవదాఅల్లన నీ అడుగులుసడి వినబడక హౄదయానికి

అలజడితో అణువణువు తడబడదా ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిదినువ్వే మీటు నాదమిది

నివాళిగా నా మది నివేదించు నిముషమిది వేణు మాధవా నీ సన్నిధి


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]