Thursday, December 20, 2007

 
కొమ్మ మీద కొకిలమ్మ
కుహు అన్నది
కుహుకుహు అన్నది
అది కూన విన్నది..ఒహో అన్నది


ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమవునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానే శ్రుతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది
అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది..కలలు కన్నది

ఈ లేత హ్రుదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది
అది ఎవరు విన్నది
ఈ జిగురు చెవులకే గుర్తు ఉన్నది

సాహిత్యం: ఆత్రేయ

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]