Monday, December 17, 2007

 
పాటల పల్లకివై ఊరెగే చిరుగాలి
కంటికి కనపడవే నిన్నెక్కెడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాశకి శ్వాశ ఆడదే
నిన్నె చెరుకొనిదే గుండెకి సందడుండదె
నీ కొసమే అన్వేషణ
నీ రూపు రేఖలెమో ఎవరిని అడగాలి

నిలాల కనుపాప లొకాన్ని చూస్తుంది
తన రూపు తానెప్పుడు చూపించలెనంది
అద్దంలా మెరిసే ఒక హ్రుదయం కావాలి
ఆ మదిలొ వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలకువలొ కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కల్లు ఎవరిని అడగాలి

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించె భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఈ నిమిషంలొ నీ రాగం నా మది తాకింది
తనలొ నన్నె కరిగించి పయనిస్తూ ఊంది

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]