Monday, December 17, 2007

 
ఒక అమ్మాయి గురించి

సిరివెన్నెల మా(పా)టలో

నేల్లమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ గాలమ్మ
కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒకటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం

అవని అందము కుదురు లేనిది
ఎడాదిఒక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగవెల్లువ
సొగసు పొంగులో ఈమె సాటివా
వయ్యారి ఒంపులు నీ వంటికున్నవా


కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువ్వు చిన్నబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో ఇంత మైకమా
చిరుగాలి నువ్వలా స్తంభించిపోకుమా
చెలియ తనువులో వేడి తాకితే
చలికి వణకవా సూర్యబింబమా
ఆ మంచు మంటతొ జాబిలిగా మారవా

మరి వేటూరి మా(పా)టలో

పైరులోని పచ్చదనం..పట్టు చీర కట్టింది
నీరేండల వెచ్చదనం..నుదుట బొట్టు పెట్టింది
పుప్పొడి చెక్కిలుగా..పుత్తడి తన వళ్ళుగా
పున్నమి ఈ కన్యగా..పుడమిలోన పుట్టింది

తూరుపు ఉదయిస్తుంది ఎర్రని పెదవులు వెకువగా
పడమర జోకొడుతుంది నల్లని కురులే రాతిరిగా
హిమాలయం ఎదురుస్తొంది చల్లని ఆ చిరునవ్వులుగా
సాగరమే పొంగుతుంది ఆ కన్యకుమారి కులుకులుగా
దిక్కులు నాలుగు ఒక్కటి చేసి చెక్కిన చక్కెర బొమ్మను చూసి
ఉక్కిరిబిక్కిరి కదాయగా

ఆమని విరబూస్తుంది ఆమెను చూసిన కన్నులలో
వేసవి వేధిస్తుంది ఆ చెలి చేరని వెన్నెలలో
మెరుపుల తొలకరి పుడుతుంది మెలికలు తిరిగిన వన్నెలలో
చలి చలి కొరిక చిగురిస్తుంది నెచ్చలి వెచ్చని కౌగిలిలో
ఋతువులు ఆరు అతివగ మారి..జతకై చెరిన వెతలే తీరి

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]