Thursday, December 20, 2007

 
కదిలింది కరుణరధం
సాగింది క్షమాయుగం
మనిషికొరకు దైవమే
కరిగి వెలిగే కాంతిపధం

మనుషులు చేసిన పాపం
మమతల భుజాన ఒరిగింది
పరిశుద్ద ఆత్మతో పండిన గర్భం
వరపుత్రునికై వగచింది
దీనజనాళికై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి
పాపక్షమాపణ పొందిన హ్రుదయాలు నిలివునా కరిగి నీరైనాయి

"అమ్మలార నా కోసం ఏడవకండి
మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి"

ద్వేషం..అసూయ..కార్పణ్యం..ముళ్ళకిరీటమయ్యింది
ప్రేమ..సేవ..త్యాగం..నెత్తురై వొలికింది
తాకినంతనే స్వశ్థత నొసగిన తనువుపై కొరడా చెళ్ళంది
అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా
బెదిరిపోయిన మూగ కొనలు చెల్లాచెదురై కుమిలాయి

పరమవైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు
నెత్తురు ముద్దగ మారాయి
అభిక్షిత్తుని రక్తాభిషెకంతో ధరణి దరించి ముద్దడింది
శిలువను తాకిన కల్వరిరాళ్ళు..కలవరపడి అరిచాయి

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]