Monday, December 17, 2007

 
తెలిమంచు కరిగింధి తలుపుతీయనా ప్రభూ!
ఇలగొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ!
నీ తోవ పొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ! పవళించు భువనాలు
భానుముర్తి! నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశ్రుతిని
పాడని ప్రక్రుతిని ప్రధమక్రుతిని

భూపాల! నీ మ్రొల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలొ పసికూన రాగలు
పసిడి కిరణల పడి పదను తేరిన చాలు
తలయూచు తలిరాకు బహుపారకులు విని
దొరలనీ దోరనగపు దొంతరని
తరలనీ దారి తొలగి రాతిరిని

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]