Monday, December 17, 2007

 
మనసు కాస్త కలతపడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచువారు
ఎవరు లేరని చితి ఒడి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరేళ్ళు నిండుగా జీవించమన్నది


కలసి రాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరు ఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మ కన్న..మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మ
బేలవై కూలితే నేలపై ప్రాణముండదమ్మ


ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు
పరిమార్చవే కీడు
కాళివైతే నీ కాలికింద అణుగును చూడు
నిను అణిచేవాడు
మౄత్యువును మించే హాని ఎక్కడుంది
ఎంతటి గాయమైనా మాని తీరుతుంది
అందుకే పద ముందుకే..లోకం రాదా నీ వెనకే

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]