Monday, December 17, 2007

 
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలసి
శ్రీరామచందురుడ్ని కొవ్వేలొ ఖైదు చేసి
రాకాసి రావణుడ్ని గుండెలొ కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి

వెతికే మజలి దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా..క్షణమైనా మిన్నాగునా
కట్టాలి నీలొని అన్వెషణ..కన్నిటిపై వంతెన
బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లెదు లొకాన
నీ శొకమే శ్లొకమై పలికించరా మనిషి

అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసు వంచి దారియ్యవా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషెకమెగా
ఆ రామ గాధ నువ్వు రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగిన దారి చూపకుందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషి

before this song is recorded there is another version for this Song written by Sirivennela which is given below (not available in Audio)

కపికులం కపికులం మనుషుల రూపంలో
కలకలం కలకలం మనసుల మౌనంలో
కపికులం కపికులం నరుల సమూహంలో
కలకలం కలకలం భక్తి ప్రవాహంలో

సుడిగాలిలాగ రెచ్చి, గుడిలోకి తరలివచ్చి
మదిలోని బురద తెచ్చి ముదిరేటి భక్తి పిచ్చి
అది నీ పాదాలపై వదిలిందిరా దేవా…

మనిషిలో మనిషిని చూసావా దేవా?
మనసులో మురికిని భక్తని అనుకోవా?
భేరీలు పగలగొట్టి, బూరాలు ఎక్కుపెట్టి
పిలిచింది శక్తి కొద్దీ, బీభత్సమైన భక్తి
ఈ కేకల ధాటికి వైకుంఠమే దిగవా!

భజనలే చేయరా చిడతలు చేపట్టి
పూజలే జరపరా పూనకమే పుట్టి!
గుడిలోన అడుగుపెట్టి, కోరికల కూతపెట్టి
వెను తరుముంటె భక్తి గుండెల్లొ గుబులు పుట్టి
భగవంతుడే గడగడా వణకాలిరా నరుడా!

Comments:
hi how did u get this?

such a awesome blog
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]