Friday, August 27, 2010

 
కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే
కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం
కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం
కొడుకై పుట్టిన..కొలువై ఉండినా..సిరులే తెచ్చినా..మరులే పెంచినా
ఎవరికి ఎవరు సొంతమవుదురో తెలియదు

సిరిగలవాడే నడిచొస్తుంటే..సంపదలన్ని దరి చేరుకుంటే
ముద్దులతోటే మురిసేదొకరు..ముచ్చట తీరా పిలిచేది ఒక్కరు
పలుగాడితే పదివేలుగా..ఓడి ఆడిటే వరహాలుగా
ఆ అల్లిబిల్లి ఆటలతోనే మనసు నిండగా..మరులు పండగా

ఎక్కడో పుట్టేది..ఎక్కడొ పెరిగేది
ఎవరికి తెలియని వింత జీవితం
ఇది ఏడు జన్మలాడుకొనే వింత బ్రతుకు నాటకం

కడుపున కన్నా..కొడుకెదురున్నా
కౌగిలిలో ఆల్లాడుతుంటే
కనలేకున్నా...తనవాడన్నా
మమకారాలే పెనవేసుకుంటే
ఏ తల్లి నోము ఫలియించనో
ఏ ఇంటి దీపం వెలిగించునో
ఆ ఒక్కడి కోసం దిక్కులు మొక్కే మనసులెన్నెన్నో మమతలెన్నెన్నొ

భ్రమలతో పెరిగేది..శ్రమలతో ఎదిగేది
ఎంతకు తెలియదు ఈ వింత జీవితం
వెలుగు చీకటి ఆయినదే బ్రతుకు నాటకం

తనయుడి తల్లి..పెళ్ళికి మళ్ళీ తలవంచుకొనే తలరాత చూస్తే
నిన్నటి నాన్న..రేపటి కొడుకు కలిసే రోజే కళ్యాణమైతే
కలిపే ఈ తల్లే ఇలవేలుపై
కలిసే ఆ జంటే కలకాలమై
ఈ కన్నీటి కధ కంచికి చేరి కలలు పండేనా బ్రతుకు నిండేనా


చిత్రం:- రెపటి కోదుకు
సాహిత్యం:- ????
సంగీతం:- క్రిష్ణ చక్ర
గానం:- నాగుర్ బాబు (మనో)




konDalO dEvuDiki gunDelO guDi kaDitE
koluvai unTaaDanEdi manishi nammakam
koDukai vastaaDanEdi talli nammakam
koDukai puTTina..koluvai unDinaa..sirulE tecchinaa..marulE penchinaa
evariki evaru sontamavudurO teliyadu

sirigalavaaDE naDichostunTE..sampadalanni dari chErukunTE
muddulatOTE murisEdokaru..mucchaTa teeraa pilichEdi okkaru
palugaaDitE padivElugaa..ODi aaDiTE varahaalugaa
aa allibilli aaTalatOnE manasu ninDagaa..marulu panDagaa

ekkaDO puTTEdi..ekkaDo perigEdi
evariki teliyani vinta jeevitam
idi EDu janmalaaDukonE vinta bratuku naaTakam

kaDupuna kannaa..koDukedurunnaa
kougililO aallaaDutunTE
kanalEkunnaa...tanavaaDannaa
mamakaaraalE penavEsukunTE
E talli nOmu phaliyinchanO
E inTi deepam veliginchunO
aa okkaDi kOsam dikkulu mokkE manasulennennO mamatalennenno

bhramalatO perigEdi..SramalatO edigEdi
entaku teliyadu ee vinta jeevitam
velugu cheekaTi aayinadE bratuku naaTakam

tanayuDi talli..peLLiki maLLI talavanchukonE talaraata choostE
ninnaTi naanna..rEpaTi koDuku kalisE rOjE kaLyaaNamaitE
kalipE ee tallE ilavElupai
kalisE aa janTE kalakaalamai
ee kanneeTi kadha kanchiki chEri kalalu panDEnaa bratuku ninDEnaa


chitram:- repaTi kOduku
saahityam:- ????
sangeetam:- krishNa chakra
gaanam:- naaagur baabu (manO)

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]