Saturday, August 28, 2010

 
వేదమంత్రం కలిపింది ఈ బంధం..ప్రతి జంటకి వినిపించని కళ్యాణరాగం
జీవితాంతం విడిపోని దాంపత్యం..ధర్మనికి కామనికి నిజమైన అర్ధం
నాతిచరమి బాసలను దాటని బంధం పెళ్ళంటే
దానికి మేమే సాక్ష్యమని చాటిస్తున్నది మీ జంటే

మూడు ముళ్ళుసే మూహుర్తం దీపమవుతుంది
ఎడు జన్మాల దారిని చూడమంటుంది
పెళ్ళి కాగానే చెరో సగమైన ఇద్దరిది
ఎకమవుతూనే ఒకే ఒక లోకమవుతుంది
ఎవరికి ఎవరితో ముడిపడి ఉందో ఎవరికి తెలుసు విధి వ్రాత చెరపగలమా ఆ గీత

వేదమంత్రం కలిపింది ఈ బంధం..ప్రతి జంటకి వినిపించని కళ్యాణరాగం
ప్రేమబంధం కరువైన దాంపత్యం..కష్టాలకి కన్నీళ్ళకి బలి అవడం సత్యం

రెండు హ్రుదయాలు ముడివేసే ప్రేమ ఉంటేనే నిండు నూరేళ్ళు నిజంగా పండగవుతుంది
నాలుగు పాదాలు ఒకే మార్గాన సాగనిదే ఎడు అడుగులతో ప్రయాణం ఆగిపోతుంది
ఇద్దరు కలిసి ఇష్టపడి ముందడుగు వెస్తే సప్తపది
పెద్దలు అంతా కష్టపడి ముందుకు తోస్తే శాపమది
గడిచిన జన్మం రాగల జన్మం చూసినదెవ్వరని
తెలియని జన్మల కోసం బ్రతుకును చితిలో తోస్తారెందుకని

హ్రుదయానికి ఉరితాడయే తాళికి తలవంచాలా?
నూరేళ్ళ కారాగారం కాపురమని అంటారా?

చిత్రం:- మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాల మంచిది
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- శ్రీనివస మూర్తి
గానం:- బాలు, శ్రీరాం ప్రభు

vEdamantram kalipindi ee bandham..prati janTaki vinipinchani kaLyaaNaraagam
jeevitaantam viDipOni daampatyam..dharmaniki kaamaniki nijamaina ardham
naaticharami baasalanu daaTani bandham peLLanTE
daaniki mEmE saakshyamani chaaTistunnadi mee janTE

mooDu muLLusE moohurtam deepamavutundi
eDu janmaala daarini chooDamanTundi
peLLi kaagaanE cherO sagamaina iddaridi
ekamavutUnE okE oka lOkamavutundi
evariki evaritO muDipaDi undO evariki telusu vidhi vraata cherapagalamaa aa geeta

vEdamantram kalipindi ee bandham..prati janTaki vinipinchani kaLyaaNaraagam
prEmabandham karuvaina daampatyam..kashTaalaki kannILLaki bali avaDam satyam

renDu hrudayaalu muDivEsE prEma unTEnE ninDu noorELLu nijamgaa panDagavutundi
naalugu paadaalu okE maargaana saaganidE eDu aDugulatO prayaaNam aagipOtundi
iddaru kalisi ishTapaDi mundaDugu vestE saptapadi
peddalu antaa kashTapaDi munduku tOstE Saapamadi
gaDichina janmam raagala janmam choosinadevvarani
teliyani janmala kOsam bratukunu chitilO tOstaarendukani

hrudayaaniki uritaaDayE taaLiki talavanchaalaa?
noorELLa kaaraagaaram kaapuramani anTaaraa?

chitram:- maa aaviDa meeda oTTu mee aaviDa chaala manchidi
saahityam:- sirivennela
sangeetam:- SrInivasa moorti
gaanam:- baalu, SrIraam prabhu

Labels: , , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]