Sunday, August 29, 2010

 
అచ్చ తెలుగు బాషరా అమ్మంటే..అచ్చు వేద ఘొషరా అమ్మంటే
ఆప్యాయత కంచంలో అనురాగంలా..తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా..తొలి అక్షర ముత్యమురా అమ్మంటే

ఆకశాన స్రుష్టికర్త బ్రహ్మరా
అవనిమీద స్రుష్టికర్త అమ్మరా
గోదావరి, కాశ్మీరం, ఓ తిరుపతి క్షేత్రం
నీ ధ్యాసే నిరంతరం..ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్చమైన శ్వాశరా
అమ్మంటే స్పష్టమైన యాసరా

అమ్మ పాట మానవాళి జాతీయగీతం
అమ్మ మాట ఆవుపాల జలపాతం
పాలతోటి మురిపాలు..ఇదే అమ్మ స్తన్యం
ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదం రా
అమ్మంటే మరో ప్రణవ నాదం రా

చిత్రం:- సూపర్ హీరోస్
సాహిత్యం:- ఏవియస్
సంగీతం:- మణిశర్మ
గానం:- బాలు

accha telugu baasharaa ammanTE..acchu vEda ghosharaa ammanTE
aapyaayata kanchamlO anuraagamlaa..toli annam muddaraa ammanTE
aatmeeyata phalakampai anubandhamlaa..toli akshara mutyamuraa ammanTE

aakaSaana srushTikarta brahmaraa
avanimeeda srushTikarta ammaraa
gOdaavari, kaaSmeeram, O tirupati kshEtram
nee dhyaasE nirantaram..idE amma gOtram
ammanTE swacchamaina SwaaSaraa
ammanTE spashTamaina yaasaraa

amma paaTa maanavaaLi jaatIyageetam
amma maaTa aavupaala jalapaatam
paalatOTi muripaalu..idE amma stanyam
prEma, karuNa, jaali, daya ivE amma sainyam
ammanTE janajeevana vEdam raa
ammanTE marO praNava naadam raa

chitram:- soopar hIrOs
saahityam:- Eviyas
sangeetam:- maNiSarma
gaanam:- baalu

Labels: , , , , ,


 
మాయదారి లోకంలో మమతలూరు
మంచితనానికే మరో పేరు వాళ్ళ ఊరు
తాతలు ఇచ్చిన ఆస్తి ఇదెకరాలు
ఎంత మనిషికైనా ఎడు అడుగులు చాలు
అనగనగా ఇదో రాజు కధ..మారాజు కధ..సుబ్బరాజు కధ

పుట్టాడు ఒక సుపుత్రుడు లేక లేక
చదివించారు వాడ్ని డిగ్రీ దాక
చదువొచ్చిన మారాజని సంతసమాయె
వాడొస్తే ఇల్లంతా సంబరమాయె
సుబ్బరాజు కొడుకంటే సూర్యుడంత వెలుగు
వాడ్ని చూసి కన్న తల్లి వెన్నలాగ కరుగు
ఒక చెత్తో ఉద్యోగం సంపాదించి
రెండు చేతులా డభ్భులు సంపాదించే కోడుకు వాళ్ళకు ఉన్నాడని సంతోషించారు
రాచిలకతోటి సంబంధం ఖాయం చేసారు

అనగనగా ఇదో రాజు కధ..మారాజు కధ..సుబ్బరాజు కధ

కొత్త దంపతుల షికార్లు అర్ధరాత్రి వరకు
కునుకు లేదు పెద్దొళ్ళకు కోడికూత వరకు
అత్తగారు మామగారు వస్తే ఇక సరేసరి
ఎత్తిపొడుపులు ఆపై వెట్టిచాకిరి
పాల కరువు, నీళ్ళ కరువు, ప్రేమ కరువు పట్నంలో
కన్నవారిపై దయ జాలి కలుగు నరకంలో
పున్నామ నరకంలో ఎన్నాళ్ళని ఉండగలరు అక్కడ వాళ్ళు
కన్నీళ్ళను మింగుతూ అక్కడ వాళ్ళు
కాలుతున్న కొవ్వోత్తిగా కన్నతల్లి మారింది
ఆమె బాధ చూసి కన్నతండ్రి శిలగా మారేడు
కొడుకుగారి నిర్వాకం..తల్లి అనారోగ్యం
మందుకైన చిల్లిగవ్వ లేక తండ్రికి వైరాగ్యం

అనగనగా ఇదో రాజు కధ..మారాజు కధ..సుబ్బరాజు కధ

చచ్చినాక తలకొరువులు పెడతారట కొడుకులు
కొందరు బ్రతికుండగానే చితిపేర్చే కొరువులు
సాటిమనిషిగా చూస్తే చాలన్నాడు
సానుభూతిలేని బ్రతుకు చావన్నాడు
అమ్మ పేరు అనాధ..నాన్న ఊరు నడివీధి
అనాధాశ్రమానికే నడిపించెను దుర్విధి
కన్న కొడుకు తీర్చెను ఇలా కన్నవారి ఋణము
కడుపున సుడి తిరిగెను కన్నీటి కడలి జలము

చిత్రం:- సుబ్బరాజుగారి కుటుంబం
సాహిత్యం:- వేటురి
సంగీతం:- కీరవాణి
గానం:- కీరవాణి

Labels: , , ,


Saturday, August 28, 2010

 
అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా?
ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా
కలనైనా రమ్మని పిలిచేవా?
నా కన్నుల్లో చెమ్మలు తుడిచేవా?

గుండె పగిలిపోతున్నా గొంతు విప్పలేను
కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను
ఈ మూగ రాగమేదొ ఆలకించవా
ఆలకించి నన్ను నీవు ఆదరించవా

చందమామ రాకుంటే కలువ నిలువ లేదు
జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువ లేదు
ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా
ఆశ పడ్డ కన్నె మనసు బాస నీదిరా

చిత్రం:- భగత్
సాహిత్యం:- ????
సంగీతం:- నవీన్ జ్యొతి
గానం:- చిత్ర

anni neevanukunnaa..evarunnaru neekannaa?
ee raadhamma kOrEdi ninnEnuraa
kalanainaa rammani pilichEvaa?
naa kannullO chemmalu tuDichEvaa?

gunDe pagilipOtunnaa gontu vippalEnu
kalalu cherigipOtunnaa kalata cheppalEnu
ee mooga raagamEdo aalakinchavaa
aalakinchi nannu neevu aadarinchavaa

chandamaama raakunTE kaluva niluva lEdu
jataga neevu lEkunTE bratuku viluva lEdu
innaaLLu kaachukunna aaSa neediraa
aaSa paDDa kanne manasu baasa neediraa

chitram:- bhagat
saahityam:- ????
sangeetam:- naveen jyoti
gaanam:- chitra

Labels: , , , ,


 
దేశపతాకపు జాతిపతాకపు చెప్పరా జై హింద్
అందరి గుండెల వందేమాతరగీతం జై హింద్
నవ భారత దేశమిది..నెత్తురు చిందిన దేశమిది..
గాంధి మాహత్ముడు పుట్టిన దేశమిది

మతమే వేరైనా మనమంతా ఒకటేనొయి
పక్షులు వేరైనా గగనం ఒకటేనొయి
దేహం వేరైనా మన రక్తం ఒకటేనొయి
ఆశలు వేరైనా దేశం ఒకటేనొయి
బుద్దుడు పుట్టి అహింసే బోదించిన దేశమిది
శత్రువులను తల నరికే అరివీరుల దేశమిది
రక్తం చిలికి..కన్నీరొలికి..నిర్మించుకున్న ధన్య చరితమే
నిర్జించలేని భరతదేశమే
త్యాగులకు తొలివందనము..ఆ తల్లికి ఇదే అభివందనము

చట్టం..మన రక్తం..ఒక వేగం చూడాలొయి
దేహం వెనువంటే విజయాలు నడుస్తాయోయి
మనమే జణగణమై ఘన శక్తి వహించాలోయి
శక్తి వహిస్తేనే చరిత్ర రచిస్తుందోయి
చట్టం చేత బట్టి నువ్వు నీతిని నిలబెట్టు
అడ్డం వచ్చినవాడిని తొడగొట్టి పడగొట్టు
పిలుపే వింటే గెలుపే నీది
మన సాటి విశ్వమందు లేదయా
మనది జనని జన్మభూమి ఇండియా
స్వరాజ్యమునకు ఇది వందనము..సురాజ్యమునకు ఇది స్వాగతము

చిత్రం:- జై హింద్
సాహిత్యం:- రాజశ్రి
సంగీతం:- విద్యాసాగర్
గానం:- బాలు

dESapataakapu jaatipataakapu chepparaa jai hind
andari gunDela vandEmaatarageetam jai hind
nava bhaarata dESamidi..netturu chindina dESamidi..
gaandhi maahatmuDu puTTina dESamidi

matamE vErainaa manamantaa okaTEnoyi
pakshulu vErainaa gaganam okaTEnoyi
dEham vErainaa mana raktam okaTEnoyi
aaSalu vErainaa dESam okaTEnoyi
budduDu puTTi ahimsE bOdinchina dESamidi
Satruvulanu tala narikE ariveerula dESamidi
raktam chiliki..kannIroliki..nirminchukunna dhanya charitamE
nirjinchalEni bharatadESamE
tyaagulaku tolivandanamu..aa talliki idE abhivandanamu

chaTTam..mana raktam..oka vEgam chooDaaloyi
dEham venuvanTE vijayaalu naDustaayOyi
manamE jaNagaNamai ghana Sakti vahinchaalOyi
Sakti vahistEnE charitra rachistundOyi
chaTTam chEta baTTi nuvvu neetini nilabeTTu
aDDam vacchinavaaDini toDagoTTi paDagoTTu
pilupE vinTE gelupE needi
mana saaTi viSwamandu lEdayaa
manadi janani janmabhoomi inDiyaa
swaraajyamunaku idi vandanamu..suraajyamunaku idi swaagatamu

chitram:- jai hind
saahityam:- raajaSri
sangeetam:- vidyaasaagar
gaanam:- baalu

Labels: , , , ,


 
వేదమంత్రం కలిపింది ఈ బంధం..ప్రతి జంటకి వినిపించని కళ్యాణరాగం
జీవితాంతం విడిపోని దాంపత్యం..ధర్మనికి కామనికి నిజమైన అర్ధం
నాతిచరమి బాసలను దాటని బంధం పెళ్ళంటే
దానికి మేమే సాక్ష్యమని చాటిస్తున్నది మీ జంటే

మూడు ముళ్ళుసే మూహుర్తం దీపమవుతుంది
ఎడు జన్మాల దారిని చూడమంటుంది
పెళ్ళి కాగానే చెరో సగమైన ఇద్దరిది
ఎకమవుతూనే ఒకే ఒక లోకమవుతుంది
ఎవరికి ఎవరితో ముడిపడి ఉందో ఎవరికి తెలుసు విధి వ్రాత చెరపగలమా ఆ గీత

వేదమంత్రం కలిపింది ఈ బంధం..ప్రతి జంటకి వినిపించని కళ్యాణరాగం
ప్రేమబంధం కరువైన దాంపత్యం..కష్టాలకి కన్నీళ్ళకి బలి అవడం సత్యం

రెండు హ్రుదయాలు ముడివేసే ప్రేమ ఉంటేనే నిండు నూరేళ్ళు నిజంగా పండగవుతుంది
నాలుగు పాదాలు ఒకే మార్గాన సాగనిదే ఎడు అడుగులతో ప్రయాణం ఆగిపోతుంది
ఇద్దరు కలిసి ఇష్టపడి ముందడుగు వెస్తే సప్తపది
పెద్దలు అంతా కష్టపడి ముందుకు తోస్తే శాపమది
గడిచిన జన్మం రాగల జన్మం చూసినదెవ్వరని
తెలియని జన్మల కోసం బ్రతుకును చితిలో తోస్తారెందుకని

హ్రుదయానికి ఉరితాడయే తాళికి తలవంచాలా?
నూరేళ్ళ కారాగారం కాపురమని అంటారా?

చిత్రం:- మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాల మంచిది
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- శ్రీనివస మూర్తి
గానం:- బాలు, శ్రీరాం ప్రభు

vEdamantram kalipindi ee bandham..prati janTaki vinipinchani kaLyaaNaraagam
jeevitaantam viDipOni daampatyam..dharmaniki kaamaniki nijamaina ardham
naaticharami baasalanu daaTani bandham peLLanTE
daaniki mEmE saakshyamani chaaTistunnadi mee janTE

mooDu muLLusE moohurtam deepamavutundi
eDu janmaala daarini chooDamanTundi
peLLi kaagaanE cherO sagamaina iddaridi
ekamavutUnE okE oka lOkamavutundi
evariki evaritO muDipaDi undO evariki telusu vidhi vraata cherapagalamaa aa geeta

vEdamantram kalipindi ee bandham..prati janTaki vinipinchani kaLyaaNaraagam
prEmabandham karuvaina daampatyam..kashTaalaki kannILLaki bali avaDam satyam

renDu hrudayaalu muDivEsE prEma unTEnE ninDu noorELLu nijamgaa panDagavutundi
naalugu paadaalu okE maargaana saaganidE eDu aDugulatO prayaaNam aagipOtundi
iddaru kalisi ishTapaDi mundaDugu vestE saptapadi
peddalu antaa kashTapaDi munduku tOstE Saapamadi
gaDichina janmam raagala janmam choosinadevvarani
teliyani janmala kOsam bratukunu chitilO tOstaarendukani

hrudayaaniki uritaaDayE taaLiki talavanchaalaa?
noorELLa kaaraagaaram kaapuramani anTaaraa?

chitram:- maa aaviDa meeda oTTu mee aaviDa chaala manchidi
saahityam:- sirivennela
sangeetam:- SrInivasa moorti
gaanam:- baalu, SrIraam prabhu

Labels: , , , , ,


 
జనంలోకి వస్తుంది జనవరి ఒకటి
గతంలోకి పోతుంది ముప్పైఒకటి
చిందేయి చిందేయి చిట్టి అమ్మడు
మందేయి మందేయి ఓరి తమ్ముడు

పోయిన ఏడు ఇదేలాగునా సంబరపడ్డాము
యమ welcome చెప్పాము
budget వచ్చి కొంపలు ముంచి వెళ్ళిపోయే భాయి
ఎడాది వెళ్ళిపొయే భాయి
నాయకులంతా ఒకమాటపై నిలిచే ఉన్నారు
పాత పాటే పాడారు
గొర్రెకు బెత్తేడు తొకేనా అని లాగి చూడకోయి
ఉన్నది ఊడిపోవునోయి
దేశం దేశం..అప్పుల కోసం పోటి పడుతూ ఎగబడుతుంటే
నీది నాది ఏముంది అప్పు చెయ్యవోయి..అది తప్పు కాదు భాయి
అప్పే గురువు అప్పే దైవం గొప్ప సూత్రమోయి

గుడ్డ రేటు పెరిగిదంటే కట్టుకోక మానేద్దాము
ఆకు చుట్టుకుందాము
బ్రాంది రేటు పెరిగిందంటే సారా తాగుదాము
నాటు సారా తాగుదాము
తిండికి గింజలు కరువైపొతే తిండి మానుకుందాము
ఎండ్రు గడ్డినే తిందాము
నాగరికతను పక్కకు తోసి గతంలోకి పోదాము
ఆది మానవులమై పోదాము
ఎన్నటికైనా...జమక్ జమక్ జమకు
రెపటికైనా..అర్రే అర్రే అర్రే
లోకంపోకడ ఒకటేలేరా..అందుకే ముందు వెనుక చూడదంటారా
అందిన కొద్ది మందే కోట్టి ముందుకు పోదాం రా
గతాన్ని మరిచే పొదాం రా

చిత్రం:- రేపటి కోదుకు
సాహిత్యం:- ????
సంగీతం:- క్రిష్ణ చక్ర
గానం:- బాలు, వందేమాతరం శ్రీనివాస్

janamlOki vastundi janavari okaTi
gatamlOki pOtundi muppaiokaTi
chindEyi chindEyi chiTTi ammaDu
mandEyi mandEyi Ori tammuDu

pOyina EDu idElaagunaa sambarapaDDaamu
yama #welcome# cheppaamu
#budget# vacchi kompalu munchi veLLipOyE bhaayi
eDaadi veLLipoyE bhaayi
naayakulantaa okamaaTapai nilichE unnaaru
paata paaTE paaDaaru
gorreku bettEDu tokEnaa ani laagi chooDakOyi
unnadi ooDipOvunOyi
dESam dESam..appula kOsam pOTi paDutU egabaDutunTE
needi naadi Emundi appu cheyyavOyi..adi tappu kaadu bhaayi
appE guruvu appE daivam goppa sootramOyi

guDDa rETu perigidanTE kaTTukOka maanEddaamu
aaku chuTTukundaamu
braandi rETu perigindanTE saaraa taagudaamu
naaTu saaraa taagudaamu
tinDiki ginjalu karuvaipotE tinDi maanukundaamu
enDru gaDDinE tindaamu
naagarikatanu pakkaku tOsi gatamlOki pOdaamu
aadi maanavulamai pOdaamu
ennaTikainaa...jamak jamak jamaku
repaTikainaa..arrE arrE arrE
lOkampOkaDa okaTElEraa..andukE mundu venuka chooDadanTaaraa
andina koddi mandE kOTTi munduku pOdaam raa
gataanni marichE podaam raa

chitram:- rEpaTi kOduku
saahityam:- ????
sangeetam:- krishNa chakra
gaanam:- baalu, vandEmaataram SrInivaas

Labels: , , , , ,


 
రామలాలి మేఘశ్యామ లాలి..ప్రేమ లాలి ప్రేమతనయ లాలి
ఈ బొమ్మ కోసం ఆ బ్రహ్మ శాపం
కష్టాల కన్నీళ్ళ ఊయ్యాల వేస్తే పాడేను లాలి..కన్నీళ్ళు రాలి
రేపటి కొడుకా ఇదే బ్రతుకు నడక

క్షణకాలం పాపాన్ని చెసినదెవ్వరని..మోసిన కడుపు కోసిన పేగు నిజమే చెప్పదని
పుడుతూనే పిడికిలు బిగదీసి అడిగావా
బదులే దొరకని భాదలతోటే బావురుమన్నవా
నీల కాన్నీరు నే చూడలేను
కాలాన్ని నిలదీసి నువ్వు అడగలేవు
ఈ భంధం ఏనాటిదో?
రేపటి కొడుకా ఇదే బ్రతుకు నడక

నాన్నెవ్వరో తెలియని వాడే రాజ్యం చేసాడు
తెలిసుకొనే బాధల వేదన భారతమన్నాడు
ఆనాటి మగవాలింక మిగిలే ఉన్నారు
బ్రతికిన మగువకి తలకొరివి పెట్టి తగలేస్తున్నరు
సిరులుండి సుఖమన్నదే లేదు నాకు
పదిమంది కలిముండి ఎకాకి నీవు
ఈ భంధం ఏనాటిదో?
రేపటి కొడుకా ఇదే బ్రతుకు నడక

చిత్రం:- రేపటి కొడుకు
సాహిత్యం:- ???
సంగీతం:- క్రీష్ణ చక్ర
గానం:- చిత్ర

raamalaali mEghaSyaama laali..prEma laali prEmatanaya laali
ee bomma kOsam aa brahma Saapam
kashTaala kannILLa Uyyaala vEstE paaDEnu laali..kannILLu raali
rEpaTi koDukaa idE bratuku naDaka

kshaNakaalam paapaanni chesinadevvarani..mOsina kaDupu kOsina pEgu nijamE cheppadani
puDutUnE piDikilu bigadeesi aDigaavA
badulE dorakani bhaadalatOTE baavurumannavaa
neela kaannIru nE chooDalEnu
kaalaanni niladeesi nuvvu aDagalEvu
ee bhandham EnaaTidO?
rEpaTi koDukaa idE bratuku naDaka

naannevvarO teliyani vaaDE raajyam chEsaaDu
telisukonE baadhala vEdana bhaaratamannaaDu
aanaaTi magavaalinka migilE unnaaru
bratikina maguvaki talakorivi peTTi tagalEstunnaru
sirulunDi sukhamannadE lEdu naaku
padimandi kalimunDi ekaaki neevu
ee bhandham EnaaTidO?
rEpaTi koDukaa idE bratuku naDaka

chitram:- rEpaTi koDuku
saahityam:- ???
sangeetam:- krIshNa chakra
gaanam:- chitra

Labels: , , , ,


 
మనిషి మనిషికి ఓ చరిత్ర
మనిషి మనసులో మరో చరిత్ర
సగము వినోదము..సగము విషాదము
ఇంతే ఈ లోక చరిత్ర

తూరుపులో ఉదయించే సూర్యుడు..పడమరలో క్రుంగకుండ మానడు
మనుగడ విలువలు..చీకటి వెలుగులు..మనిషికివి రోజు ఇవి పాఠాలు
ఈ సత్యం అను నిత్యం తెలుసుకున్న నాడు రావు కొరతలు

సంసారమన్నది ఒక శతకము..దాంపత్యం అది సాగే మార్గము
పతి ఒక చక్రము..సతి ఒక చక్రము..కలిసి మెలిసి సాగితే స్వర్గము
కాదంటే లేదంటే అంత కంతే ఏమ్ముంది నరకము

మనిషి మనిషికి ఓ చరిత్ర
ప్రతి మనిషిది ఒక పాత్ర
ఎన్నో రకాలుగా ఎవో మతాలుగా సాగే అనంతయాత్ర

మహరాజు వెలిసాడీ ఇంటిలో..కొలువే తీరాడు పొరుగింటిలో
వయసే మీరినా బరువు భాధ్యత తెలియదు పాపం పసివాడికి
మతి లేదా? శ్రుతి లేదా? బ్రతుకు విలువ ఎవరు అతనికి తెలిపేది?

లోకానికి ఉన్నవి నలు దిక్కులు..ఆ ఇంటికి ఉన్నవి ఇరు దిక్కులు
భర్తే తూరుపు..భార్యే పడమర..దిక్కులేదు పాపం పసిదానికి
ఎవరమ్మా ఎవరమ్మా జరుగుతున్న కధను మలుపు తిప్పేది?

భర్త ఒడే ఆ భార్యకు కోవెల..భర్త నీడే తన కాశి ప్రయాగ
ఆకలిదప్పులు ఎరుగని ప్రేమలా కలిసి మెలిసి జీవించే ఇంటిలో
అటు లేమి ఇటు కలిమి నడుమ నలుగుతున్న కధకు తుది ఏది?

చిత్రం:- మనిషికో చరిత్ర
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

manishi manishiki O charitra
manishi manasulO marO charitra
sagamu vinOdamu..sagamu vishaadamu
intE ee lOka charitra

toorupulO udayinchE sooryuDu..paDamaralO krungakunDa maanaDu
manugaDa viluvalu..cheekaTi velugulu..manishikivi rOju ivi paaThaalu
ee satyam anu nityam telusukunna naaDu raavu koratalu

samsaaramannadi oka Satakamu..daampatyam adi saagE maargamu
pati oka chakramu..sati oka chakramu..kalisi melisi saagitE swargamu
kaadanTE lEdanTE anta kantE Emmundi narakamu

manishi manishiki O charitra
prati manishidi oka paatra
ennO rakaalugaa evO mataalugaa saagE anantayaatra

maharaaju velisaaDI inTilO..koluvE teeraaDu poruginTilO
vayasE meerinaa baruvu bhaadhyata teliyadu paapam pasivaaDiki
mati lEdaa? Sruti lEdaa? bratuku viluva evaru ataniki telipEdi?

lOkaaniki unnavi nalu dikkulu..aa inTiki unnavi iru dikkulu
bhartE toorupu..bhaaryE paDamara..dikkulEdu paapam pasidaaniki
evarammaa evarammaa jarugutunna kadhanu malupu tippEdi?

bharta oDE aa bhaaryaku kOvela..bharta neeDE tana kaaSi prayaaga
aakalidappulu erugani prEmalaa kalisi melisi jeevinchE inTilO
aTu lEmi iTu kalimi naDuma nalugutunna kadhaku tudi Edi?

chitram:- manishikO charitra
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gaanam:- baalu

Labels: , , , ,


Friday, August 27, 2010

 
కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే
కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం
కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం
కొడుకై పుట్టిన..కొలువై ఉండినా..సిరులే తెచ్చినా..మరులే పెంచినా
ఎవరికి ఎవరు సొంతమవుదురో తెలియదు

సిరిగలవాడే నడిచొస్తుంటే..సంపదలన్ని దరి చేరుకుంటే
ముద్దులతోటే మురిసేదొకరు..ముచ్చట తీరా పిలిచేది ఒక్కరు
పలుగాడితే పదివేలుగా..ఓడి ఆడిటే వరహాలుగా
ఆ అల్లిబిల్లి ఆటలతోనే మనసు నిండగా..మరులు పండగా

ఎక్కడో పుట్టేది..ఎక్కడొ పెరిగేది
ఎవరికి తెలియని వింత జీవితం
ఇది ఏడు జన్మలాడుకొనే వింత బ్రతుకు నాటకం

కడుపున కన్నా..కొడుకెదురున్నా
కౌగిలిలో ఆల్లాడుతుంటే
కనలేకున్నా...తనవాడన్నా
మమకారాలే పెనవేసుకుంటే
ఏ తల్లి నోము ఫలియించనో
ఏ ఇంటి దీపం వెలిగించునో
ఆ ఒక్కడి కోసం దిక్కులు మొక్కే మనసులెన్నెన్నో మమతలెన్నెన్నొ

భ్రమలతో పెరిగేది..శ్రమలతో ఎదిగేది
ఎంతకు తెలియదు ఈ వింత జీవితం
వెలుగు చీకటి ఆయినదే బ్రతుకు నాటకం

తనయుడి తల్లి..పెళ్ళికి మళ్ళీ తలవంచుకొనే తలరాత చూస్తే
నిన్నటి నాన్న..రేపటి కొడుకు కలిసే రోజే కళ్యాణమైతే
కలిపే ఈ తల్లే ఇలవేలుపై
కలిసే ఆ జంటే కలకాలమై
ఈ కన్నీటి కధ కంచికి చేరి కలలు పండేనా బ్రతుకు నిండేనా


చిత్రం:- రెపటి కోదుకు
సాహిత్యం:- ????
సంగీతం:- క్రిష్ణ చక్ర
గానం:- నాగుర్ బాబు (మనో)




konDalO dEvuDiki gunDelO guDi kaDitE
koluvai unTaaDanEdi manishi nammakam
koDukai vastaaDanEdi talli nammakam
koDukai puTTina..koluvai unDinaa..sirulE tecchinaa..marulE penchinaa
evariki evaru sontamavudurO teliyadu

sirigalavaaDE naDichostunTE..sampadalanni dari chErukunTE
muddulatOTE murisEdokaru..mucchaTa teeraa pilichEdi okkaru
palugaaDitE padivElugaa..ODi aaDiTE varahaalugaa
aa allibilli aaTalatOnE manasu ninDagaa..marulu panDagaa

ekkaDO puTTEdi..ekkaDo perigEdi
evariki teliyani vinta jeevitam
idi EDu janmalaaDukonE vinta bratuku naaTakam

kaDupuna kannaa..koDukedurunnaa
kougililO aallaaDutunTE
kanalEkunnaa...tanavaaDannaa
mamakaaraalE penavEsukunTE
E talli nOmu phaliyinchanO
E inTi deepam veliginchunO
aa okkaDi kOsam dikkulu mokkE manasulennennO mamatalennenno

bhramalatO perigEdi..SramalatO edigEdi
entaku teliyadu ee vinta jeevitam
velugu cheekaTi aayinadE bratuku naaTakam

tanayuDi talli..peLLiki maLLI talavanchukonE talaraata choostE
ninnaTi naanna..rEpaTi koDuku kalisE rOjE kaLyaaNamaitE
kalipE ee tallE ilavElupai
kalisE aa janTE kalakaalamai
ee kanneeTi kadha kanchiki chEri kalalu panDEnaa bratuku ninDEnaa


chitram:- repaTi kOduku
saahityam:- ????
sangeetam:- krishNa chakra
gaanam:- naaagur baabu (manO)

 
తప్పులేదు ఒప్పులేదు చెప్పు తీసికొట్టండి
తప్పదింక అన్నలార పిరికితనం మానండి
గడ్డితినే నాయకులని నడ్డి విరిగతన్నండి
చచ్చైనా దేశాన్ని రక్షించండి రండి

లద్దే పురుగులాంటోడు పెద్దపదవిలోకి చేరి
అడ్డు అదుపు లేక మనని అణగదొక్కుతావుంటే
ముఖ్యమంత్రి అయిన ఈ నక్క బుద్ది నాయాలని
మక్కెలు విర్చి జనం మధ్య తుక్కు రేగ తన్నండి

కాశ్మీరం సీమ నుండి కన్యాకుమారి వరకు
కులమతాలు ఎవ్వైనా భరతమాత బిడ్డలని
రాం రహిం కలవాలి
రాం రహిం కలవాలి
రాజ్యమింక వెలగాలి
మతాలకే అతీతమై జాతే వర్దిలాలి

చిత్రం:- భారత్ బంద్
సాహిత్యం:- జొన్నవిత్తుల
సంగీతం:- ?????
గానం:- బాలు



tappulEdu oppulEdu cheppu teesikoTTanDi
tappadinka annalaara pirikitanam maananDi
gaDDitinE naayakulani naDDi virigatannanDi
chacchainaa dESaanni rakshinchanDi ranDi

laddE purugulaanTODu peddapadavilOki chEri
aDDu adupu lEka manani aNagadokkutaavunTE
mukhyamantri ayina ee nakka buddi naayaalani
makkelu virchi janam madhya tukku rEga tannanDi

kaaSmIram seema nunDi kanyaakumaari varaku
kulamataalu evvainaa bharatamaata biDDalani
raam rahim kalavaali
raam rahim kalavaali
raajyaminka velagaali
mataalakE ateetamai jaatE vardilaali

chitram:- bhaarat band
saahityam:- jonnavittula
sangeetam:- ?????
gaanam:- baalu

 
రెండే రెండు కులాలు..అవి మగవాలు స్త్రీలు..
రెండే రెండు మతాలు..అవి భూమి ఆకాశాలు..
ఈ జంటని కలిపేది ఒక హ్రుదయం..
ఆ రెంటిని కలిపేది ఒక ఉదయం...
ఓం Amen రాం జీసెస్

I dont believe in conversion..
If i am a true Hindu, i am true Christian too

గాంధిని హిందువు అనుకుంటే..సత్యం అహింస హిందువులే
క్రీస్తును క్రైస్తవుడనుకుంటే...కరుణ ప్రేమ క్రైస్తవులే
మబ్బులెంతగా వాన జల్లినా తడవదు ఆకాశం
బుద్దిహీనులు బురద జల్లితే మైలపడేనా అనురాగం
మాసిపోవునా మమకారం

అసతోమా జ్యొతిర్గమయ..తమసోమా జ్యొతిర్గమయ..మ్రుత్యోర్మా అమ్రుతంగమయ

సూర్యుడు రోజు ఉదయిస్తున్నా చీకటి తొలగని వర్ణాలు
శిలగా దేవుడు మారిపోయినా సిగ్గేపడని వాదాలు
నమ్మి చెడిన ఈ మానవ జాతికి మనసు అన్నదే ఒక శాపం
కులమతాలతో కుళ్ళినప్పుడు ప్రేమ అన్నదే యమపాశం
బ్రతుకే శూన్యాకాశం

చిత్రం:- మాస్టారి కాపురం
సాహిత్యం:- వేటురి
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు


renDE renDu kulaalu..avi mogavaalu streelu..
renDE renDu mataalu..avi bhoomi aakaaSaalu..
ee janTani kalipEdi oka hrudayam..
aa renTini kalipEdi oka udayam...
Om #Amen# raam jIses

#I dont believe in conversion..
If i am a true Hindu, i am true Christian too#

gaandhini hinduvu anukunTE..satyam ahimsa hinduvulE
kreestunu kraistavuDanukunTE...karuNa prEma kraistavulE
mabbulentagaa vaana jallinaa taDavadu aakaaSam
buddiheenulu burada jallitE mailapaDEnaa anuraagam
maasipOvunaa mamakaaram

asatOmaa jyotirgamaya..tamasOmaa jyotirgamaya..mrutyOrmaa amrutangamaya

sooryuDu rOju udayistunnaa cheekaTi tolagani varNaalu
Silagaa dEvuDu maaripOyinaa siggEpaDani vaadaalu
nammi cheDina ee maanava jaatiki manasu annadE oka Saapam
kulamataalatO kuLLinappuDu prEma annadE yamapaaSam
bratukE SoonyaakaaSam

chitram:- maasTaari kaapuram
saahityam:- vETuri
sangeetam:- raaj-kOTi
gaanam:- baalu

Labels: , , ,


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]