Saturday, January 29, 2011

 
చిత్రం
కోకిలమ్మ

గానం పి బి శ్రీనివాస్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్‌

రచన
ఆత్రేయ


మధురం మధురం నాదం అది అమరం అమరం వేదం!
నాదం గానం సామం, స్వర కలితం లలితం రమ్యం
శ్రీ వాణీ వీణా జనితం,
సురమౌని మహతీ సరితం,
అతిలోక బ్రహ్మానందం, ఓంకారనాదం!
అమితం అమృతం నిరతం,
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం మధ్యమ దుహితం, త్రై కాల సంచారం
శ్రీ వాణీ వీణా జనితం, సురమౌని మహతీ సరితం, అతిలోక బ్రహ్మానందం, ఓంకారనాదం!

మామూలు వెదురే, మాధవ మురళియై, రాగాల సుధలే చిలికినది |2|
త్యాగయ్య గళమై, అన్నయ్య పదమై, వాగ్గేయ సిరులే కురిసినది
గీతం కవితా హృదయం, సంగీతం జనతా హృదయం, రాగం తానం మకుటం, త్రై మూర్తి రూపం

జయదేవ కవితై, గోవింద గీతై, పద్మావతేగా పలికినది |2|
ప్రియురాలి శోకమే, తొలి కావ్య శ్లోకమై, శ్రీ రామ చరితై నిలిచినది
తీరని దాహం గానం, కడతీర్చే జ్ఞానం గానం, రాగం భోగం మోక్షం, సంగీత యోగం!
శ్రీ వాణీ వీణా జనితం, సురమౌని మహతీ సరితం, అతిలోక బ్రహ్మానందం, ఓంకారనాదం!

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]