Saturday, January 29, 2011

 
స్వామి శరణం అయ్యప్పా..సర్వం నీవే అయ్యప్పా
నీ శుభచరణం అయ్యప్పా..బవభయ హరణం అయ్యప్పా

ఎమి జన్మమిది..ఎమి జీవనం..
ఇంక చాలు ఈ మాయ నటనం
పునరపి జననం..పునరపి మరణం
అంతా మిధ్య..నీవే శరణం

మడి అని..శుచి అని..నీతులు చెబుతూ
గుడిసెలలో దూరే భక్తులెందరో
దేవుని పేరిట మారణహోమం
సాగించే ఆ స్వాములెందరో
చిక్కిన పదవులు దక్కడానికి
చేయించే అభిషేకాలేన్నో
ప్రజల దోపిడికి పరిహారంగా
నిలువుదోపిడి అంతులేన్నో
జగన్నాటక సూత్రదారినని జనులంత నన్నంటారు
ప్రతి స్వార్ధపరుడి నాటకంలోన పాత్రధారినైపోయాను
అందరు నాతో మొరలిడితే
నేనెవరితో మొరలిడను
ఈ దేవునికే జరిగే మోసం..ఇంకే దేవునితో చెప్పుకోను

అలసితివేమో అయ్యప్పా..హారతి ఇదిగో అయ్యప్పా
పవళించుమైయా అయ్యప్పా..ఇది భక్తుని కోరిక అయ్యప్పా

సాహిత్యం:- సినారె
గానం:- బాలు



swaami SaraNam ayyappaa..sarvam neevE ayyappaa
nee SubhacharaNam ayyappaa..bavabhaya haraNam ayyappaa

emi janmamidi..emi jeevanam..
inka chaalu ee maaya naTanam
punarapi jananam..punarapi maraNam
antaa midhya..neevE SaraNam

maDi ani..Suchi ani..neetulu chebutU
guDiselalO doorE bhaktulendarO
dEvuni pEriTa maaraNahOmam
saaginchE aa swaamulendarO
chikkina padavulu dakkaDaaniki
chEyinchE abhishEkaalEnnO
prajala dOpiDiki parihaarangaa
niluvudOpiDi antulEnnO
jagannaaTaka sootradaarinani janulanta nannanTaaru
prati swaardhaparuDi naaTakamlOna paatradhaarinaipOyaanu
andaru naatO moraliDitE
nEnevaritO moraliDanu
ee dEvunikE jarigE mOsam..inkE dEvunitO cheppukOnu

alasitivEmO ayyappaa..haarati idigO ayyappaa
pavaLinchumaiyaa ayyappaa..idi bhaktuni kOrika ayyappaa

saahityam:- sinAre
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]