Saturday, January 29, 2011

 
మాయదారి క్రిష్ణయ్య ఎంతటివాడో..ఓరయ్యొ
నాటకల బూటకల నీటుకాడు వాడు..ఓరయ్యొ
ఆడదాని చూసి ఆగలేడు వాడు
జంటకోరి వెంట పడతాడు
ఆశ రేపుతాడు, ఊసులాడుతాడు, రాస క్రీడలాడు
మంత్రగాడు, తంత్రగాడు

పొరిగింటి పాలు..హరిలో రంగ హరి,
ఇరుగింటి పెరుగు..హరిలో రంగ హరి
పొరిగింటి పాలు..ఇరుగింటి పెరుగు
మరిగినాడు వెన్నదొంగ
ఆ పాలకడలి..హరిలో రంగ హరి,
యజమానుడైనా..హరిలో రంగ హరి,
ఆ పాలకడలి యజమానుడైనా
పరుల పాడి కోరనేలా?
ఎంతవారికైనా ఎదుటి సొమ్ము తీపి
ఏమి దేవుడండి..అన్యుల ఆస్తి..మోజు జాస్తి

పదహారువేల..హరిలో రంగ హరి
సతులున్నవాడు..హరిలో రంగ హరి
పదహారువేల సతులున్నవాడు
రాధనేల వీడడంట?
ఆ మేనయత్త..హరిలో రంగ హరి
తొలి వలపు కాదా..హరిలో రంగ హరి
ఆ మేనయత్త తొలి వలపు కాదా
మొదటి ప్రేమ మరువడంట
వాడి దివ్యలీల, కావ్యగీత మాల
చెప్పినాను చాలా..పాడుకోంది భక్తులారా

సినిమా:- మిస్టర్ పెళ్ళం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కీరవాణి
గానం:- బాలు

maayadaari krishNayya entaTivaaDO..Orayyo
naaTakala booTakala neeTukaaDu vaaDu..Orayyo
aaDadaani choosi aagalEDu vaaDu
janTakOri venTa paDataaDu
aaSa rEputaaDu, oosulaaDutaaDu, raasa kreeDalaaDu
mantragaaDu, tantragaaDu

poriginTi paalu..harilO ranga hari,
iruginTi perugu..harilO ranga hari
poriginTi paalu..iruginTi perugu
mariginaaDu vennadonga
aa paalakaDali..harilO ranga hari,
yajamaanuDainaa..harilO ranga hari,
aa paalakaDali yajamaanuDainaa
parula paaDi kOranElaa?
entavaarikainaa eduTi sommu teepi
Emi dEvuDanDi..anyula aasti..mOju jaasti

padahaaruvEla..harilO ranga hari
satulunnavaaDu..harilO ranga hari
padahaaruvEla satulunnavaaDu
raadhanEla veeDaDanTa?
aa mEnayatta..harilO ranga hari
toli valapu kaadaa..harilO ranga hari
aa mEnayatta toli valapu kaadaa
modaTi prEma maruvaDanTa
vaaDi divyaleela, kaavyageeta maala
cheppinaanu chaalaa..paaDukOndi bhaktulaaraa

sinimaa:- misTar peLLam
saahityam:- aarudra
sangeetam:- keeravaaNi
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]