Saturday, January 29, 2011

 
హే పాండురంగ, పండరినాథ
శరణం శరణం శరణం

బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె

విద్యా బుద్దులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపలు కోరిన వారిని కరుణించాడు సర్వేస్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్స శ్యామకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడిగా
యద్భావం తద్భవతని దర్షనమిచ్చాడు ధన్యుల చెశాడు

పెను తుపాను తాకిడిలో అలమటించు దీనులను
ఆదరించె సాయినాధ నాధుడై
అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచ్చె పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను ప్రక్షాలణ చెసికొనెను
దౌత్య క్రియ సిద్దితో శుద్దుడై
అంగములను వేరుచెసి ఖండయోగ సాధనలొ
అత్మశక్తి చాటెను సిద్దుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం
నాస్తికులకు సాయే శరణం
భక్తికి సాయే శరణం
ముక్తికి సాయే శరణం

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]