Saturday, January 29, 2011

 
ఆ వన్నెలు ఎక్కడివి
తూర్పుకాంత మోములో
ప్రణయమో బిడియమో
తల్లినవుతానని గర్వమో

తల్లిని చేస్తాడని మగడిపైన వలపు
నెలతప్పిన నాటినుంచి బిడ్డడిదే తలపు
అమ్మా..అమ్మా అని విన్నప్పుడే ఆడబ్రతుకు గెలుపు
అందుకే ప్రతినిత్యం ప్రసవించును తూరుపు

నన్నయ్యకు ఏమి తెలుసు
యశోదమ్మ మనసు
ఆమె ఎదపై నిదురించిన కన్నయ్యకు తెలుసు
మగవాడికి ఆడగుండె అవసరమె తెలుసు
పాపాయికి ఆమె అమ్మతనం తెలుసు

-------------

ఆరవైకి ఆరెళ్ళకి ఎమిటి అనుబంధం
దీపానికి దెవుడికి ఉండే సంబంధం

పొద్దుగుంకిపోతున్న తరుణంలో
నేను చందమామ కావాలని కోరానా
వద్దన్న వచ్చింది వెన్నెల
కరిగిపొమ్మన్న పోకుంది ఈనాడు ఆ కల

అప్పుడు నీ అల్లరితో మురిపించావు
ఇప్పుడు నా బ్రతుకునే అల్లరి చేసావు
మనిషికి ఒక్కటే శిక్ష పెద్దతనం
తెలియని శ్రిరామరక్ష పసితనం

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]