Saturday, January 29, 2011

 
తెల్లరింది లెగండొయి..కొక్కొరోక్కో
మంచాలింక దిగండొయి..కొక్కొరోక్కో

పావులాంటి సీకటి పడగ దించిపోయింది
బయమునేదు బయమునేదు నిదర ముసుగుతీయంది
సావులాటి రాతిరి సూరు దాటిపోయింది
బయమునేదు బయమునేదు సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండి

సురుకు తగ్గిపోయింది, సెందురిడి కంటికి
సులకనైపోయింది - లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది - సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చి పోయింది - అల్లుకున్న పాపం

మసక బారి పోయిందా సూసే కన్ను
ముసురు కోదా మైకం మన్నూ మిన్నూ
కాలం కట్టిన గంతలు తీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి

----

ఎక్కిరించు రేయిన సూసి, ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి ఇసిరిందా, సూరిడి సూపుల బాణం
కాలి, బూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల నీడ

సెవట బొట్టు సవురుగా సూరిణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వెకువ శక్తుల కత్తులు దూసి
రేతిరి మత్తును ముక్కలు సేసి

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]