Saturday, January 29, 2011

 
మా పాపలు తొలగించ దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మజన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా
మేము తరియించినామయ్యా

పసిపాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడు ఉంటాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోలీల ఆటలో కొండంత సత్యం చాటవు ఓ సాయి
మమ్ము సాకవు మా సాయి
వాసనలు ఎమైనా..వర్ణాలు ఎమైనా
పూలన్ని ఒకటంటివి
నిను పూజించ తగునంటాఇవి
మా తడిలేని హ్రుదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి
మాలో కలతల్ని మాపేస్తివి

పెడుతుంటే పెరిగేది ప్రేమ అన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చును మేలైన మరు జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా
వారి బాధల్ని మోసవయ్యా
ఎనాడు పుట్టవో..ఎడేడ తిరిగావో
నీవెంత వాడైతివో
ఈ ద్వారకమాయి నివాసమాయే
ధన్యులమైనామయా
మేము తరియించినామయా



maa paapalu tolagincha deepaalu neevE veliginchinaavayyaa
mammu karuNinchinaavayyaa
janmajanmaala puNyaala panTalE ninnu darSinchinaamayyaa
mEmu tariyinchinaamayyaa

pasipaapa manasunna prati manishilOnu paramaatmuDu unTaaDani
vaaDu pariSudduDavutaaDani
gOleela aaTalO konDanta satyam chaaTavu O saayi
mammu saakavu maa saayi
vaasanalu emainaa..varNaalu emainaa
poolanni okaTanTivi
ninu poojincha tagunanTAivi
maa taDilEni hrudayaala dayatOTi taDipi
kalupulni teesEstivi
maalO kalatalni maapEstivi

peDutunTE perigEdi prEma anna annam
migilEdi ee puNyam
icchunu mElaina maru janmam
rOgulni prEminchi vyaadhulni maapi maru janma icchaavayyaa
vaari baadhalni mOsavayyaa
enaaDu puTTavO..eDEDa tirigaavO
neeventa vaaDaitivO
ee dwaarakamaayi nivaasamaayE
dhanyulamainaamayaa
mEmu tariyinchinaamayaa

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]