Saturday, January 29, 2011

 
డబ్బెవరికి చేదు పిచ్చొడా..డబ్బెవరికి చేదు మంచోడా
ఈ భూమి తిరిగేది రూపాయి చుట్టూ
ఈ మనిషి కోరేది రూపాయి చెట్టు
డబ్బొక్కటే దైవము..డబ్బొక్కటే లోకము

పిసినిగొట్టువాడి శవం కాలదు ఏమిచేసినా
పచ్చనొటు పడగానే కాలుతుంది భగ్గున
లక్షలున్నవాడి మొదౌలు..బిక్షమెత్తువాడి వరకు
గుర్రాలపయి కాసి కాసి గాడిదలవుతారు కడకు
కుంటివాడ్ని గుడ్డివాడు దోచబోతే..ఇద్దరివి వేషాలే చూడబొతే
డబ్బన్నదో జబ్బురా..మందన్నదే లేదురా

కోటీశుని చావుకోసం చూస్తారు బందువులు
వీలుంటే అంత విషం పోస్తారు రాభందులు
చెట్టుకి రూపాయలే కాయగలిగితే
కాయలని వదిలేసి కోసుకుంటారు గుంపులే
రూపాయి వెంట మనిషి పరుగులెత్తితే
అది వల్లకాటి కాష్టంగా మారిపొతే
విశ్రాంతిరా నీకదే..డబ్బక్కడా బూడిదే


చిత్రం:- డబ్బెవ్వరికి చేదు
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ????
గానం:- బాలు

Dabbevariki chEdu picchoDaa..Dabbevariki chEdu manchODaa
ee bhoomi tirigEdi roopaayi chuTTU
ee manishi kOrEdi roopaayi cheTTu
DabbokkaTE daivamu..DabbokkaTE lOkamu

pisinigoTTuvaaDi Savam kaaladu EmichEsinaa
pacchanoTu paDagaanE kaalutundi bhagguna
lakshalunnavaaDi modaulu..bikshamettuvaaDi varaku
gurraalapayi kaasi kaasi gaaDidalavutaaru kaDaku
kunTivaaDni guDDivaaDu dOchabOtE..iddarivi vEshaalE chooDabotE
DabbannadO jabburaa..mandannadE lEduraa

kOTeeSuni chaavukOsam choostaaru banduvulu
veelunTE anta visham pOstaaru raabhandulu
cheTTuki roopaayalE kaayagaligitE
kaayalani vadilEsi kOsukunTaaru gumpulE
roopaayi venTa manishi parugulettitE
adi vallakaaTi kaashTangaa maaripotE
viSraantiraa neekadE..DabbakkaDaa booDidE


chitram:- Dabbevvariki chEdu
saahityam:- sirivennela
sangeetam:- ????
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]