Saturday, January 29, 2011

 
స్వాతంత్ర్యం రాలేదని చెప్పింది ఎవ్వరురా
సూర్యోదయం చూడలేని గుడ్లగూబరా
స్వరాజ్యంలో కన్నీళ్ళకు కారణం ఎవ్వరురా
ధనార్జనే ధేయమైన రాజకీయ రాబందులురా

జండా ఉంచా రహే హమరా
విజయీవిశ్వ తిరంగా ప్యారా
పుట్టిపెరిగిన దేశం కోసం ప్రాణమిచ్చిన వారి గుండెరా
ఈ జండ ఈ జండ
ఇది భరతజాతి మెడలోని దండరా

ఊరితాడుని ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో
తూటలకు తెగిపడినా రామరాజు గుండెల్లో
అజాదు, సుఖదేవు, రాజగురు ఊపిరిలో
జలియన్ వాలాభాగులో ప్రవహించిన రక్తంలో
పుష్పించిన మందారం..ఈ జండా
వర్షించిన మకరందం..ఈ జండా
మనలాగే వాళ్ళు కూడా చదుసంధ్యలెక్కువంటే
వాళ్ళు కూడా మనలాగే కొలువేదొ చేసుకుంటే
చావంటే భయమంటే..చావచచ్చి బ్రతికుంటే
డిల్లినేలే దొరగారి కాళ్ళకాడ పడివుంటే
బానిసలై బ్రతికేవాళ్ళము..
తెల్లోడి గానుగెద్దులయేవాళ్ళము

భరతమాత పేరువింటే ఒళ్ళు పులకరించకుండా
ఎవరు ఆమె, ఎవ్వరయ్య, ఎవరి భార్య అనేవారు
august 15కు సెలవెందుకు వచ్చిందో
అర్ధంకానట్టి వాళ్ళు నెటి తరం కుర్రవాళ్ళు
ఎంత కర్మ పట్టినాదిరా..
ఈ జాతిని ఎవరు నిదురలేపుతారురా
రెడ్డి ఉండె, రాజూ ఉండె, కమ్మ ఉండె, కాపు ఉండె
అంధ్రుడన్నవాడు లేకపోయరా
హిందువుండె, ముస్లిం ఉండె, క్రిస్తవుదు సిఖ్ ఉండే
భారతీయుడన్నవాడు కానరాక పోయరా
త్యగాలు వ్రుధ ఆయరా..
మ్రుతవీరులా కన్న కలలు కల్లలాయెరా

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]