Saturday, January 29, 2011

 
నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికి..తేలదే ఎన్నటికి
అందుకే నీ కధకి అంతులేదప్పటికి
తీరాలు లేవే ప్రేమ నీ దారికి

కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా? వేదనే వేదమా?
శాపమే దీవెనా? నీకిదే న్యాయమా?
కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా

రెప్పలే దాటవే ఎప్పుడు ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే మెరుపులో మిల మిల
కాంతిలా కనపడే బ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా? అసత్యాల గమ్యమా?
నీతో పయనమే పాపమా ప్రణయమా


nuvvu evvari edalO puvvula Rtuvai eppuDu vastaavO
ninnu nammina jatalO navvulu chidimi enduku pOtaavO
teliyadE evvariki..tEladE ennaTiki
andukE nee kadhaki antulEdappaTiki
teeraalu lEvE prEma nee daariki

kalatalE kOvelai koluvayE vilayamaa
valapulO narakamE varamanE virahamaa
taapamE deepamaa? vEdanE vEdamaa?
SaapamE deevenaa? neekidE nyaayamaa?
kannIrabhishEkamaa niraaSa naivEdyamaa
madilO manTalE yaagamaa praNayamaa

reppalE daaTavE eppuDu E kala
ninginE taakadE kaDalilO E ala
nElapai nilavadE merupulO mila mila
kaantilaa kanapaDE braanti ee vennela
araNyaala maargamaa? asatyaala gamyamaa?
neetO payanamE paapamaa praNayamaa

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]