Saturday, January 29, 2011

 
||ప|| |ఆమె|
పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని,
పిలిస్తే పలుకుతానని పలు మార్లు ఇదే మాటని,
నువ్వే అన్నావని అంతా అంటే విని
ఆశగా ఆర్తిగా ఆశ్రయించాను ఆదుకోమని సాయి చేదుకోవోయి
.
చరణం:
నమ్మని వారిని సైతం వదలక నడిపిన నీ చేయి,
నాకూ అందించవా సాయి
నవ్విన వారికి సైతం వరములు కురిపించావోయి
నా పై అలకెందుకు సాయి
నిన్న దాక నా కన్నులు మూసిన అహం అలిసిపోయి
కన్నీట కరిగిపోయి
నిన్ను గాక ఇంకెవరిని వేడను అంటున్నది సాయి
పాదాలు కడగనీయి
ఏమరపాటున ఉన్నావా, నా మొర వినలేకున్నావా
నా పొరపాటును మన్నించక నువ్వ్ ఏమేమో అనిపిస్తావా
తలొంచే తలపు చాలని, క్షణం లో కరుగుతానని
జయిస్తే మాయ ప్రశ్ననీ జవాబై దొరుకుతానని
నువ్వే అన్నావని అంతా అంటే విని
గుండెలో నిండుగా ఆ అభయ ముద్రనే నింపుకున్నాను సాయి చేదుకోవోయి
.
చరణం:
నీ చిరునవ్వుల శాంతికి తానే రూపమైనదోయి
ఈ దీపాన్ని కాపు కాయి
పరుల కోసమే నిను ప్రార్ధించే నెచ్చెలి చేదోయి,
పచ్చగ బతక నీయి సాయి,
నిత్యం ను కొలువుండే ఆ మది ఆమెది కాదోయి,
అది నీ ద్వరకామాయి,
నిట్ట నిలువునా కోవెల కూలితె నష్టం నీదోయి,
నీకే నిలువ నీడ పోయి
ప్రేమను పంచే ప్రియ నేస్తం, ప్రేమను పెంచే సుమ శాస్త్రం,
ప్రేమను మించిన దైవం లేదను నీ సూక్తికి భాష్యం,
చలించని భక్తి నిండని, పరీక్షించేది నేనని,
తెలిస్తే చింత లేదని, తరించే దారదేనని
నువ్వే అన్నావని అంతా అంటే విని
ఆలన పాలన అన్నీ నీవని విన్నవించనీ సాయి చేదుకోవోయి

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]