Saturday, January 29, 2011

ఏమయ్యా ఓ రామయ్యా!
ఏమయ్యా ఓ రామయ్యా!
ఎలా సేవించాలయ్యా?
నిను ఏమని కీర్తించాలయ్యా?

పదములు పడదామనుకుంటే మారుతి చరణలొదలడు
పదములు పడదామనుకుంటే మారుతి చరణలొదలడు
ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు
ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయారు
పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయారు
ప్రాణాలిద్దాం అనుకుంటే పక్షి జటాయువులుంటారు

ఏమయ్యా ఓ రామయ్యా!
ఎలా సేవించాలయ్యా?
నిను ఏమని కీర్తించాలయ్యా?

కమ్మని చరితం రాద్దామంటే కవి వాల్మికిని కానయ్యా
కమ్మని చరితం రాద్దామంటే కవి వాల్మికిని కానయ్యా
గానంతో కొలవాలనుకుంటే ఘన త్యాగయ్యను కాదయ్యా
గానంతో కొలవాలనుకుంటే ఘన త్యాగయ్యను కాదయ్యా
ఆశతో కోవెల కడదామంటే తాహశిల్దారును కానయ్యా
ఆశతో కోవెల కడదామంటే తాహశిల్దారును కానయ్యా
ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా

ఆల్బం:- శ్రీరామ గానామ్రుతం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కె వి మహదేవన్
గానం:- బాలు

Emayyaa O raamayyaa!
Emayyaa O raamayyaa!
elaa sEvinchaalayyaa?
ninu Emani keertinchaalayyaa?

padamulu paDadaamanukunTE maaruti charaNalodalaDu
padamulu paDadaamanukunTE maaruti charaNalodalaDu
phalamulu tinipinchaalanTE paapam Sabariki beduru
phalamulu tinipinchaalanTE paapam Sabariki beduru
paadam kaDagaalanukunTE padapaDi guhuDE tayaaru
paadam kaDagaalanukunTE padapaDi guhuDE tayaaru
praaNaaliddaam anukunTE pakshi jaTaayuvulunTaaru

Emayyaa O raamayyaa!
elaa sEvinchaalayyaa?
ninu Emani keertinchaalayyaa?

kammani charitam raaddaamanTE kavi vaalmikini kaanayyaa
kammani charitam raaddaamanTE kavi vaalmikini kaanayyaa
gaanamtO kolavaalanukunTE ghana tyaagayyanu kaadayyaa
gaanamtO kolavaalanukunTE ghana tyaagayyanu kaadayyaa
aaSatO kOvela kaDadaamanTE taahaSildaarunu kaanayyaa
aaSatO kOvela kaDadaamanTE taahaSildaarunu kaanayyaa
aakhariki manasiddaamanTE adi EnaaDO needayyaa

aalbam:- SrIraama gaanaamrutam
saahityam:- aarudra
sangeetam:- ke vi mahadEvan
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]