Saturday, January 29, 2011

 
క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురు
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవరు
చేజారితే ఈలంటి రోజు రావు ఎన్నడు
అందుకే నువ్వు ప్రతిక్షణాన్ని అందుకో గురు

కాలేజిలో కాన్వేంటులో ఏం నేర్చుకున్నం మనమసలు
footpathలో foodవేటలొ నా అక్షరాభ్యాసం మొదలు
అడుగు అడుగు ఒక అవసరం
విషమ పరిక్షలే అనుదినం
ఎదురుపడిన భేతాళప్రశ్నలకు
బదులుపలకనిదే కదలవు ముందుకు
బ్రతుకు బళ్ళొ చదువంటే..వరద వొళ్ళొ ఎదురీతే


ఎంత కష్టపడి సొంత తిండి తిని..ఆకలిలో రుచి తెలుసుకున్న
కటిక నేలపడి ఒళ్ళు అలసి..నిద్దర్లో హాయిని కలుసుకున్న
జన్మలోనే తొలిసారి..చెమట పరిమాళాన్ని చూస్తున్న
freedom మన policy
మనమే మన fantasy
ఎవరివెనకనో నీడగా పడిఉండాలా మనం
యౌవనతరుణము రవ్వలు చిమ్మితే తలొంచాలి జనం
కెరాఫ్ గాలుగా బ్రతకమురా
yes we have our own dress and address


చేజారాకే తెలిసింది..గతకాలంలోని సౌందర్యం
దూరమునుంచె పిలిచింది..అనుబంధంలోని మాధుర్యం
మార్గం మన మొండితనం..దీపం మన గుండెబలం
కోరిన విలువలు చేతికి దొరకవా..అది చూద్దం చలో..చలో
జారిన వెలుగులు..తళ తళ వెలగవా..జ్వలించే కళ్ళలో
రేయే తెలియని సూర్యుడినవుతా
మాయే తగలని మెలకువనవుతా

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]