Saturday, January 29, 2011

 
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా
నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా


నువ్వే మా మొదటి guestని
మా ఆవిడ వంట bestని
ఈ feastకి పిలుచుకొస్తిని taste చెప్పి పోరా
ఇదే మా విందు భోజనం
మీరే మా బంధువీ దినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా
అపార్ధం చేసుకోరుగా
అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటది
పదార్ధం చెత్తగున్నది
ఇది విందా నా బొందా
తిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక పదరకుంకా


భళారే నీలి చిత్రమా
భలేగా వుంది మిత్రమా
ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా
కోరావు అసలు ట్రూతును
చూపాను సిసలు బూతును
చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను
తమాషా చూడబోతిరా
తఢాఖా చూపమందురా
మగాళ్ళని ఎగిరి పడితిరా
మదించి మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా
లాకప్పు పైకప్పు మీ కిప్పుడే చూపుతా
బెండు తీస్తా

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]