Saturday, January 29, 2011

 
parugulu teesE vayasunTE..
urakalu vesE manasunTE..
bratukE oka railubanDi..
saradaala prayaaNamanDi

aapada undani nilabaDipotE..
aagadu samayam E nimisham
chiru chiru navvula deepam unTE..
chikkula cheekaTi maTumaayam
dikkulanni daaTukupovAli..chukkalunna majili chEraali..
bangaru merupula sampadalanni mungililOnE nilapaali
sandEhinchaka mundukupotE gelupu chikkaDam khAyam..
doosukupoyE dhairyam unTE oDakatappadu kaalam

konDalu kOnalu aDDunnaayani..
saagaka maanadu selayEru
gala gala paaTala hushaaru unTE..
alasaTa talavadu aa jOru
aakaaSapu anchulu taakaali..aanandapu lOtulu chuDaali
kOrina swargam chErina naaDE..
manishiki viluvani chaaTaali..
alOchinchaka aDugulu vestE..aDusu tokkaDam khAyam..
nElanu viDichina saamulu chestE..tagalaka tappadu gaayam


పరుగులు తీసే వయసుంటే..
ఉరకలు వెసే మనసుంటే..
బ్రతుకే ఒక రైలుబండి..
సరదాల ప్రయాణమండి

ఆపద ఉందని నిలబడిపొతే..
ఆగదు సమయం ఏ నిమిషం
చిరు చిరు నవ్వుల దీపం ఉంటే..
చిక్కుల చీకటి మటుమాయం
దిక్కులన్ని దాటుకుపొవాలి..చుక్కలున్న మజిలి చేరాలి..
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలిలోనే నిలపాలి
సందేహించక ముందుకుపొతే గెలుపు చిక్కడం ఖాయం..
దూసుకుపొయే ధైర్యం ఉంటే ఒడకతప్పదు కాలం

కొండలు కోనలు అడ్డున్నాయని..
సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే..
అలసట తలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి..ఆనందపు లోతులు చుడాలి
కోరిన స్వర్గం చేరిన నాడే..
మనిషికి విలువని చాటాలి..
అలోచించక అడుగులు వెస్తే..అడుసు తొక్కడం ఖాయం..
నేలను విడిచిన సాములు చెస్తే..తగలక తప్పదు గాయం

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]