Saturday, January 29, 2011

 
రాయినైనా కాకపోతిని రామపాడం సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితం రాయగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యం తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా

అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
కడలి గట్టున ఉడుతనైతే ఉడత సాయం చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా

కాకినైనా కాకపోతిని ఘతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
కాకినైనా కాకపోతిని ఘతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగా
మనిషినై జన్మించినాను మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా


ఆల్బం:- శ్రీరామ గానామ్రుతం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కె వి మహదేవన్
గానం:- పి సుశీల

raayinainaa kaakapOtini raamapaaDam sOkagaa
bOyanainaa kaakapOtini puNyacharitam raayagaa
paDavanainaa kaakapOtini swaamikaaryam teerchagaa
paadukainaa kaakapOtini bhaktiraajyamu nElagaa

aDavilOpala pakshinaitE ativaseetanu kaachanaa
anduvalana raamachandruni amita karuNanu nOchanaa
aDavilOpala pakshinaitE ativaseetanu kaachanaa
anduvalana raamachandruni amita karuNanu nOchanaa
kaDali gaTTuna uDutanaitE uData saayam chEyanaa
kaalamellaa raamabhadruni vEligurutulu mOyanaa

kaakinainaa kaakapOtini ghatukammunu chEyuchU
gaDDipOchanu Saramu chEsE ghanata raamuDu choopagaa
kaakinainaa kaakapOtini ghatukammunu chEyuchU
gaDDipOchanu Saramu chEsE ghanata raamuDu choopagaa
mahini alpajeevulE ee mahimalanni nOchagaa
manishinai janminchinaanu matsarammulu rEpagaa
mada matsarammulu rEpagaa


aalbam:- SrIraama gaanaamrutam
saahityam:- aarudra
sangeetam:- ke vi mahadEvan
gaanam:- pi suSeela

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]