Friday, February 18, 2011

 
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం

ఋజువయ్యిందే ఇక్కడ సత్యమట
వాదమాడి గెలిచిందే వేదమట
పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం
ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం..పెద్దల వాదం

గుడిసెలోన దొరికిందా సానిదట
మేడలోని ఆట నాగరీకమట
కూడులేక ఒప్పుకుంటే నేరమట
తప్పతాగి విప్పుకుంటే నాట్యమట..అది నాట్యమట

ఒకరు నమ్ముకున్న దారి రాదారి
ఒకరు ఎంచుకున్న దారి పెడదారి
మార్గాలే వేరుగాని గమ్యం ఒకటే
ఎవరు గెలిచినా గాని గెలుపు తల్లిదే..గెలుపు తల్లిదే

సినిమా:- చట్టానికి కళ్ళు లేవు
సాహిత్యం:- ????
సంగీతం:- క్రిష్ణ చక్ర
గానం:- బాలు

chaTTaaniki kaLLu lEvu tammuDu
nyaayaaniki illu lEdu eppuDu
ikkaDunnadokkaTE koTTi bratakaDam
donga dorai tiragaDam

RjuvayyindE ikkaDa satyamaTa
vaadamaaDi gelichindE vEdamaTa
pilli elukala naDuma enduku saakshyam
elukE pillini tindani peddala vaadam..peddala vaadam

guDiselOna dorikindaa saanidaTa
mEDalOni aaTa naagareekamaTa
kooDulEka oppukunTE nEramaTa
tappataagi vippukunTE naaTyamaTa..adi naaTyamaTa

okaru nammukunna daari raadaari
okaru enchukunna daari peDadaari
maargaalE vErugaani gamyam okaTE
evaru gelichinaa gaani gelupu tallidE..gelupu tallidE

sinimaa:- chaTTaaniki kaLLu lEvu
saahityam:- ????
sangeetam:- krishNa chakra
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]