Friday, February 18, 2011

 
కోర్టుకెల్లబోకురా సోదరా
కోర్టుపక్షి కాబోకురా
ఒడినోడు ఏడుస్తాడు కోర్టు ముందర
గెలిచినోడు ఏడుస్తాడు ఇంటి దగ్గర
ఏడుపే మిగిలేది కోర్టు లోపల

చట్టానికి చెవులేగాని కళ్ళు లేవురా
లాయర్లకు లా తప్ప నిజాలొద్దురా
జడ్జీలకు సాక్ష్యాలే ఆయుధాలురా..నాయనా
దున్నపోతు ఈనిందన్న సాక్ష్యులుంటే చాలురా

తిరుపతికి పోయేవాడు తలనిండుగా పోతాడు
గోవిందా..అంటూ తలగుండు చేయించుకు వస్తాడు
కోర్టుకు పోయేవాడు జేబులెగరేసుకు పోతాడు
ఉన్నదంతా తగలబెట్టి గుండేజబ్బుతో పడిపోతాడు

తాతలనాడు మనకి కోర్టులేవిరా
కొట్టుకున్న చెట్టుకిందే తీర్పురా
బుద్దుడికి బోదించిన బోధిచెట్టురా
వీడి బోధ వింటే నువ్వ్ బుద్దుడివి అవుతావురా

సినిమా:- జస్టిస్ చక్రవర్తి
సాహిత్యం:- ????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

kOrTukellabOkuraa sOdaraa
kOrTupakshi kaabOkuraa
oDinODu EDustaaDu kOrTu mundara
gelichinODu EDustaaDu inTi daggara
EDupE migilEdi kOrTu lOpala

chaTTaaniki chevulEgaani kaLLu lEvuraa
laayarlaku laa tappa nijaalodduraa
jaDjIlaku saakshyaalE aayudhaaluraa..naayanaa
dunnapOtu eenindanna saakshyulunTE chaaluraa

tirupatiki pOyEvaaDu talaninDugaa pOtaaDu
gOvindaa..anTU talagunDu chEyinchuku vastaaDu
kOrTuku pOyEvaaDu jEbulegarEsuku pOtaaDu
unnadantaa tagalabeTTi gunDEjabbutO paDipOtaaDu

taatalanaaDu manaki kOrTulEviraa
koTTukunna cheTTukindE teerpuraa
budduDiki bOdinchina bOdhicheTTuraa
veeDi bOdha vinTE nuvv budduDivi avutaavuraa

sinimaa:- jasTis chakravarti
saahityam:- ????
sangeetam:- chakravarti
gaanam:- baalu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]