Wednesday, April 6, 2011

 
దేవుడు ఉన్నాడో లేడో
మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని
తికమకపడుతున్నాడురా (2)
మానవుడున్నంత వరకు దేవుడు ఉంటాడురా (2)
వాడిని తలచేందుకు మానవుడుండాలిరా

తనలో మంచిని పెంచుకొనేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొక రూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలు మతాలుగా మారాయిరా

భయం నుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే ముక్తి అంటారురా
ముక్తి అంటారురా

మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడికోసం మనిషిని మరిచే వాడే మూడుడు
ప్రేమ, త్యాగం
ప్రేమ, త్యాగం తెలిసినవాడే మానవుడు
దేవుడి పేరిట మూడుడైతే వాడే దానవుడు
వాడే దానవుడు

గానం:- జేసుదాస్

dEvuDu unnADO lEDO
mAnavuDunnADurA
vaaDE dEvuDu kalaDO lEDani
tikamakapaDutunnADurA (2)
mAnavuDunnanta varaku dEvuDu unTADurA (2)
vaaDini talachEnduku mAnavuDunDAlirA

tanalO manchini penchukonETanduku
taanE dEvuDu ayyETanduku
manishoka roopam kalpinchADu
adi manishi manishikoka roopamayi
palu matAlugA mArAyirA

bhayam nunchi dEvuDu puTTADu
bhakti nunchi daivatvam puTTindi
bhayam bhaktulanu minchina sthitinE mukti anTArurA
mukti anTArurA

manishikOsam bratikE manishE dEvuDu
dEvuDikOsam manishini marichE vADE mooDuDu
prEma, tyAgam
prEma, tyAgam telisinavaaDE mAnavuDu
dEvuDi pEriTa mooDuDaitE vADE dAnavuDu
vADE dAnavuDu

gAnam:- jEsudAs

Labels:


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]