Friday, April 1, 2011

 
దేవతలారా దీవించండి
చేసిన తప్పులు మన్నించండి
జరిగెను ఎంత ఘోరము
తగిలెను దాని శాపము
పోగొట్టుకుంటిని నా కన్నవారిని
చేజార్చుకుంటిని నా అన్నవారిని
ఎవ్వరూలేని ఎకాకినైతిని

కంటికి రెప్పనై కావలి కాయనా
పగలురాతిరి పాపలకు
పట్టెడుగుండెనే ఊయ్యల చేయ్యనా
పలుకేనోచని సేవలకు
వినువీధి దారిలోన విహరించు తారలారా
మనసారా ఒక్కసారి నా మాట చెప్పి రారా
నాన్నా..అన్న ఒక పిలుపు చాలని

ఆశలజ్యోతితో హారతులివ్వనా
ఈ చిన్నారి కోవ్వెలకు
చెమరిన కళ్ళతో చమురును పోయ్యనా
నీ గుడి ముంగిట దివ్వెలకు
కడసారి మరణశిక్ష మన్నింపు కోరుకుంది
నీ మనసులోన ఇంత చోటు ఇస్తే చాలునంది
పోతే పోని..ఆ పైన జీవితం

గానం:- జేసుదాస్

dEvatalArA deevinchanDi
chEsina tappulu manninchanDi
jarigenu enta ghOramu
tagilenu dAni SApamu
pOgoTTukunTini naa kannavArini
chEjaarchukunTini naa annavArini
evvarUlEni ekAkinaitini

kanTiki reppanai kAvali kAyanA
pagaluraatiri pApalaku
paTTeDugunDenE ooyyala chEyyanA
palukEnOchani sEvalaku
vinuveedhi daarilOna viharinchu tAralAraa
manasArA okkasAri nA mATa cheppi rArA
nAnnA..anna oka pilupu chAlani

aaSalajyOtitO haaratulivvanA
ee chinnAri kOvvelaku
chemarina kaLLatO chamurunu pOyyanA
nee guDi mungiTa divvelaku
kaDasAri maraNaSiksha mannimpu kOrukundi
nee manasulOna inta chOTu istE chaalunandi
pOtE pOni..aa paina jeevitam

gAnam:- jEsudAs

Labels:


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]