Wednesday, April 6, 2011

 
లాలి నెర్పవమ్మా నట్టేటి హోరుగాలి
నోరులేనిదమ్మా ఈ తల్లిగాని తల్లి
నడకన్నదే రాని పసిపాపకి
వెలుగన్నదే లేని కనుపాపకి
ఆకాశమా...నువ్వైనా దారి చూపవమ్మా

ఇంతలేత పాదమే బరువెంత మోసెనో
ఇంత చిన్న ప్రాణమే బ్రతుకెంత చూసెనో
ప్రతి పూట ఒక ఏడై ఎదిగింది ఇంతలోనే
ఆరింద అయ్యిందే పారాడు ఈడులోనే
ఏ పాఠశాల నేర్పుతుంది ఇంత జీవితం

ఎంత ఓర్చుకున్నదొ అడుగడున యాతన
ఎన్ని నేర్చుకున్నదో అపాయాల అంచున
అలిగిందా అడిగిందా ఎకాకి యాత్రలోనా
ఓడిందా ఒదిగిందా రాకాసి రాత్రిలోనా
ఒక తోడుగాని గూడుగాని లేకపోయినా

గానం:- బాలు

--

కాళరాత్రి నీడలో జన్మించిన చంద్రుడా
చీకటంటే ఇంతగా భయమెందుకు తమ్ముడా
ఎప్పుడైనా జడిసేనా నా వెంట నీవు ఉంటే
గడియైన గడిచేనా నీ వేలు విడిచిపెదితే
యముడైనా చెరుకోడు నిన్ను నేను ఉండగా

కాటు వెయ్యకమ్మా కష్టాల కటిక రేయి
దాడి చెయ్యకమ్మా దయలేని ముళ్ళదారి
విషనాగువై చెరకే ఆపగా
పసివాడిపై చూపకే నీ పగ
పాపాలు చేయు ఈడు కాదు పాడులోకమా

గానం:- మిన్ మిని

సినిమా:- ఆరంభం
సంగీతం:- శ్రీ


laali nerpavammaa naTTETi hOrugAli
nOrulEnidammaa ee talligaani talli
naDakannadE raani pasipaapaki
velugannadE lEni kanupaapaki
aakaaSamaa...nuvvainaa daari choopavammaa

intalEta paadamE baruventa mOsenO
inta chinna praaNamE bratukenta choosenO
prati pooTa oka EDai edigindi intalOnE
aarinda ayyindE paaraaDu eeDulOnE
E paaThaSaala nErputundi inta jeevitam

enta Orchukunnado aDugaDuna yaatana
enni nErchukunnadO apaayAla anchuna
aligindA aDigindA ekAki yaatralOnA
ODindaa odigindaa raakaasi raatrilOnA
oka tODugaani gooDugaani lEkapOyinaa

gAnam:- bAlu

--

kaaLaraatri neeDalO janminchina chandruDA
cheekaTanTE intagaa bhayamenduku tammuDA
eppuDainaa jaDisEnaa naa venTa neevu unTE
gaDiyaina gaDichEnaa nee vElu viDichipeditE
yamuDainaa cherukODu ninnu nEnu unDagaa

kaaTu veyyakammA kashTaala kaTika rEyi
daaDi cheyyakammA dayalEni muLLadaari
vishanaaguvai cherakE aapagaa
pasivaaDipai choopakE nee paga
paapaalu chEyu eeDu kaadu paaDulOkamaa

gAnam:- min mini

sinimaa:- aarambham
sangeetam:- SrI

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]