Friday, April 1, 2011

 
చెల్లివైనా తల్లివైనా
చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
అన్ననైనా నాన్ననైనా
నీ కంటిరెప్పంటి నేనే..నీకు నేనే
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా

ఆకలివేళ అన్నను ఐనా
అన్నమై నే పుట్టనా
నీ బొజ్జ నే నింపనా
నిద్దురవేళ అమ్మను కానా
జొలలే నే పాడనా
ఊయలై నే ఊగనా
జో జో లాలి
లాలి లాలి జో లాలి
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా

చూపుడు వేలు
రాపిడి కళ్ళు
రానంత దూరాలలో
నా గుండెలో దాచనా
జనకుడు నేనై
జానకిలాగ అత్తింటికే పంపనా
పుట్టిల్లుగా మిగలనా
అన్నగా ఏడేడు జన్మాలకి

సినిమా:- సీతమ్మ పెళ్ళి
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు


chellivainA tallivainA
chaamantipuvvanTi nuvvE..nAku nuvvE
annanainA nAnnanainA
nee kanTireppanTi nEnE..neeku nEnE
amma kaDupE challagaa
nuvvu vardhillavE pacchagA
kanna kalalE panDagA
ee anna chellAyigA

AkalivELa annanu ainA
annamai nE puTTanA
nee bojja nE nimpanA
nidduravELa ammanu kAnA
jolalE nE pADanA
ooyalai nE ooganA
jO jO lAli
lAli lAli jO lAli
amma kaDupE challagaa
nuvvu vardhillavE pacchagA
kanna kalalE panDagA
ee anna chellAyigA

choopuDu vElu
rApiDi kaLLu
rAnanta doorAlalO
nA gunDelO dAchanA
janakuDu nEnai
jAnakilaaga attinTikE pampanA
puTTillugA migalanA
annagA EDEDu janmAlaki

sinimA:- seetamma peLLi
saahityam:- vETUri
sangeetam:- bAlu
gAnam:- bAlu

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]