Friday, April 1, 2011

 
చెదిరిన నీ కుంకుమలే తిరిగి రానివా
నిత్య సౌభాగ్యాలే చెరిగిపోయెనా
పసిదానివే అని చూడక
వసివాడని నీ బ్రతుకున
విధియే విషమే చిలికే

ఆరిపోనిదమ్మా నీ కన్నీటి శొకం
భారతాన స్త్రీ జాతికి భర్తయే దైవం
నూరేళ్ళు ఉండేదంటారే మాంగళ్యం
ముడినే తెంచే వేసారే ఎం ఘోరం
స్వర్గతుల్యమైనదే నీ సంసారం
శొకసంద్రమైనదే నీ ప్రాయం
బ్రతుకే మోడై మిగిలే

మానిపోనిదమ్మా నీ యెదలోని గాయం
రాలిపోయెనమ్మా నీ సిగలోని కుసుమం
పడతికి బొట్టుకాటుకలే ఆధారం
మెడకొక ఉచ్చును పోలినదే వైధవ్యం
గాజులతో కన్న కలల మోజులే పోయే
గాజుకళ్ళ జీవితమే తెల్లబోయే
తోడే నీకే కరువై

గానం:- జేసుదాస్



chedirina nee kumkumalE tirigi raanivA
nitya soubhAgyAlE cherigipOyenA
pasidAnivE ani chooDaka
vasivADani nee bratukuna
vidhiyE vishamE chilikE

aaripOnidammA nee kannITi Sokam
bhaaratAna stree jaatiki bhartayE daivam
noorELLu unDEdanTArE mAngaLyam
muDinE tenchE vEsArE em ghOram
swargatulyamainadE nee samsaaram
SokasandramainadE nee praayam
bratukE mODai migilE

mAnipOnidammA nee yedalOni gaayam
raalipOyenammA nee sigalOni kusumam
paDatiki boTTukATukalE aadhAram
meDakoka ucchunu pOlinadE vaidhavyam
gaajulatO kanna kalala mOjulE pOyE
gaajukaLLa jeevitamE tellabOyE
tODE neekE karuvai

gAnam:- jEsudAs

Labels:


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]