Friday, April 1, 2011

 
అ:
చిలిపి కళ్ళలో వలపు సిగ్గులు
ఓర చూపుల్లో దోర సిగ్గులు
కలికి నుదిటి తిలకంలో కళ్యాణం సిగ్గులు
ఎందుకో ఆ సిగ్గులెందుకో
అందుకో నా ముద్దులందుకో
ఆ:
చిలిపి కళ్ళలో వలపు సిగ్గులు
ఓర చూపుల్లో దోర సిగ్గులు
కన్నెవలపు గుండెల్లో కళ్యాణం ముగ్గులు
అందుకే ఆ వింత సిగ్గులు
అందుకే గోరంత సిగ్గులు

అ:
సాగర సంసారంలో రాగమాలికలు పాడి
ఉదయకిరణమై కదలే పెదవి సిగ్గులు
నడక హంస నాట్యమైతే
నడుము జడకు నేస్తమైతే
తడిమి తడిమి ముద్దడే జడగంటల సిగ్గులు
ఆ:
జడగంటల అందానికి
గుడిగంటల బంధానికి
ఏడెడుగుల దూరానికి ఎన్నెన్నొ సిగ్గులు

అ:
శొభన శృంగారంలో సోయగాల అలజడిలో
మూగరాగమై పాడే ముద్దు సిగ్గులు
పెదవి పెదవిపై చేరి
కొత్త పదము రాస్తుంటే
చదువుకున్న హృదయములో చకిలిగిలి సిగ్గులు
ఆ:
గిలిగింతల అందానికి
తొలిజంటల బంధానికి
సిగ్గు చిన్నదవుతుంది
సిరిమొగ్గలు వేస్తుంది

గానం:- జేసుదాస్, సుశీల

a:
chilipi kaLLalO valapu siggulu
Ora choopullO dOra siggulu
kaliki nudiTi tilakamlO kaLyANam siggulu
endukO aa siggulendukO
andukO nA muddulandukO
A:
chilipi kaLLalO valapu siggulu
Ora choopullO dOra siggulu
kannevalapu gunDellO kaLyANam muggulu
andukE aa vinta siggulu
andukE gOranta siggulu

a:
saagara samsaaramlO raagamaalikalu pADi
udayakiraNamai kadalE pedavi siggulu
naDaka hamsa nATyamaitE
naDumu jaDaku nEstamaitE
taDimi taDimi muddaDE jaDaganTala siggulu
A:
jaDaganTala andaaniki
guDiganTala bandhaaniki
EDeDugula doorAniki ennenno siggulu

a:
Sobhana SRngaaramlO sOyagAla alajaDilO
moogaraagamai paaDE muddu siggulu
pedavi pedavipai chEri
kotta padamu raastunTE
chaduvukunna hRdayamulO chakiligili siggulu
A:
giligintala andaaniki
tolijanTala bandhaaniki
siggu chinnadavutundi
sirimoggalu vEstundi

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]