Friday, April 1, 2011

 
దేవాలయాన్నే విడనాడె దైవం
ధర్మాలయాన కడతేరే ధర్మం
కలిలోన దైవాలయినా శిలలే కదా

చెవులుండి వినది చట్టం
అడిగేను దొరకని సాక్ష్యం
ఈ గుడ్డి న్యాయం కోసం
ఎన్నాళ్ళు ఈ బలిదానం
నీకున్న ఆరోప్రాణం
పెట్టింది కన్నుల ప్రాణం
ముద్దాయివన్నది లోకం
ఇది ఏమి విధి విపరీతం
జన్మమే నేరమై
ధర్మమే పాపమై
కధలా నడిచి కలలా ముగిసే నీ గాధలో


తన అన్నపై అనురాగం
తన భర్తపై మమకారం
మనసులోన రగిలే సత్యం
మాటరాక కుమిలే సాక్ష్యం
ఆ మామ కంటికి దీపం
ఈ పాప ప్రేమకు రూపం
పెనవేసుకున్న బంధం
తెంచలేదులే ఏ దైవం
న్యాయమే గుడ్డిదై
ధర్మమే కుంటిదై
ఉరితొ బిగిసి బలితో ముగిసే నీ గాధలో

గానం:- జేసుదాస్, సుశీల

dEvAlayAnnE viDanADe daivam
dharmAlayAna kaDatErE dharmam
kalilOna daivAlayinA SilalE kadA

chevulunDi vinadi chaTTam
aDigEnu dorakani sAkshyam
ee guDDi nyAyam kOsam
ennALLu ee balidAnam
neekunna aarOprANam
peTTindi kannula prANam
muddAyivannadi lOkam
idi Emi vidhi vipareetam
janmamE nEramai
dharmamE pApamai
kadhalA naDichi kalalA mugisE nee gAdhalO


tana annapai anurAgam
tana bhartapai mamakAram
manasulOna ragilE satyam
maaTaraaka kumilE saakshyam
aa mAma kanTiki deepam
ee pApa prEmaku roopam
penavEsukunna bandham
tenchalEdulE E daivam
nyAyamE guDDidai
dharmamE kunTidai
urito bigisi balitO mugisE nee gAdhalO

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]