Friday, April 1, 2011

 
హర హర మహాదేవ శంభొ హర ఓం
శుభకర శివానంద జగదీశ్వర ఓం
ప్రణవాంశ శక్తి స్వరూపాయ ఓం
ప్రళయాగ్ని సెగ శిఖల నిఠలాక్ష ఓం

ఒక వేకువ దీపంతో ఈ లోకం మేలుకొని
ఒక దేవుడి రూపంతో తన దీవేనెలందుకొని
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల పల్లె ఝల్లుమంది
ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి తలలు వంచుకుంది
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి
భంచిక భంచిక చంచక
చక్కనమ్మ ముగ్గులెట్టే ఎంచెక్కా
పాడిపంట పొంగులాడే భంచక
ఊరువాడ చిందులాడే ఎంచెక్కా

ధనధాన్యం రాసులు పోసి
ధర్మానికి దోసిల్లేసి
గుణశీలం జనకొలువైతే
మహదేవుడు మారాజైతే
ముత్యాలు పండే లోగిలళ్ళో వరాల నవ్వుల జళ్ళంటరో
సుక్కలో వెన్నెలబొమ్మ
పుట్టింటికి నడిచొస్తుంటే
పక్కన చిరునవ్వులవాడే
శివదేవుడు అనిపిస్తుంటే
ఆ తాతామనవల్లాట
ఈ ఊరికి ఊయ్యలపాట
ఆ కుంకుమ రేకుల మూట
మా గడపకి వచ్చిన పూట
పండగే వచ్చెనంట సందడంటరో
సందెపొద్దు చిందులాడే వేడుకంటరో
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి

అనురాగం పురుడొసుకొని
అనుబంధం ముడులేసుకొని
దేవుడు మనిషై పుడుతుంటే
నలుగురితో నడిచొస్తుంటే
బుడి బుడి అడుగుల నాట్యానికి ఆ నటరాజే గురుతొచ్చేనట
మనిషిని మహనీయుడు చేసే
మమతల గుడి వొడి చేసుకొని
కని పెంచే తల్లులు ఉంటే
లోకాలను వెలిగిస్తూ ఉంటే
ఆ వెలుతురు కిన్నెర పాట
తాతయ్యకు వన్నెల కోట
ఆ కోటకు రారాజెవ్వరో
ఈ కాలమే చెప్పేనంట
జాంకుకు జాంకుకు కోడిపుంజురో
జాతికోడి కూతలేసె పండగంటరో
సంకెలాడి సంకురాతిరి వచ్చెనంటరో
గొబ్బిలమ్మ పువ్వులంట ముగ్గులంటరో

ఒక దేవుడు మనిషైతే
తన తల్లికి ఎడమైతే
విలపించే అనురాగం
వెలుగెంతో తెలిసేది
చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా
కంచికి చేరని కధలా బ్రతుకు విలవిల ఏడ్వాలా
ఏడడుగుల జీవితమా
ఇది దేవుడి శాసనమా
ఏడ్పించే నా గతమా
ఒదార్చని జీవితమా

సినిమా:- పెదబాబు
సాహిత్యం:- జాలది
సంగీతం:- చక్రి
గానం:- బాలు


hara hara mahAdEva Sambho hara Om
Subhakara SivAnanda jagadeeSwara Om
praNavAmSa Sakti swarUpAya Om
praLayAgni sega Sikhala niThalaaksha Om

oka vEkuva deepamtO ee lOkam mElukoni
oka dEvuDi roopamtO tana deevEnelandukoni
musi musi navvula virisina puvvula palle jhallumandi
aa velasina dEvuDi mungiTa nilabaDi talalu vanchukundi
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti
bhamchika bhamchika chamchaka
chakkanamma mugguleTTE enchekkA
pADipanTa pongulADE bhamchaka
ooruvADa chindulADE enchekkA

dhanadhaanyam rAsulu pOsi
dharmAniki dOsillEsi
guNaSeelam janakoluvaitE
mahadEvuDu maarAjaitE
mutyAlu panDE lOgilaLLO varAla navvula jaLLanTarO
sukkalO vennelabomma
puTTinTiki naDichostunTE
pakkana chirunavvulavADE
SivadEvuDu anipistunTE
aa tAtAmanavallATa
ee ooriki ooyyalapATa
aa kumkuma rEkula mooTa
mA gaDapaki vacchina pooTa
panDagE vacchenanTa sandaDanTarO
sandepoddu chindulADE vEDukanTarO
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti

anurAgam puruDosukoni
anubandham muDulEsukoni
dEvuDu manishai puDutunTE
naluguritO naDichostunTE
buDi buDi aDugula nATyAniki aa naTarAjE gurutocchEnaTa
manishini mahaneeyuDu chEsE
mamatala guDi voDi chEsukoni
kani penchE tallulu unTE
lOkAlanu veligistU unTE
aa veluturu kinnera pATa
tAtayyaku vannela kOTa
aa kOTaku rArAjevvarO
ee kAlamE cheppEnanTa
jaamkuku jaamkuku kODipunjurO
jaatikODi kootalEse panDaganTarO
sankelADi sankuraatiri vacchenanTarO
gobbilamma puvvulanTa muggulanTarO

oka dEvuDu manishaitE
tana talliki eDamaitE
vilapinchE anurAgam
velugentO telisEdi
chiTikeDu kumkuma talliki panchE koDukai puTTAlA
kanchiki chErani kadhalA bratuku vilavila EDvAlA
EDaDugula jeevitamA
idi dEvuDi SAsanamA
EDpinchE nA gatamA
odArchani jeevitamA

sinimA:- pedabAbu
saahityam:- jAladi
sangeetam:- chakri
gAnam:- bAlu

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]